షమి రాక మరింత ఆలస్యం
ABN, Publish Date - Nov 05 , 2024 | 03:36 AM
పోటీ క్రికెట్లోకి వెటరన్ పేసర్ షమి పునరాగమనం మరింత ఆలస్యం కానుంది. ఈ ఏడాది ఆరంభంలో పాదం గాయానికి షమి శస్త్ర చికిత్స చేయించుకోవడంతో....
బెంగళూరు: పోటీ క్రికెట్లోకి వెటరన్ పేసర్ షమి పునరాగమనం మరింత ఆలస్యం కానుంది. ఈ ఏడాది ఆరంభంలో పాదం గాయానికి షమి శస్త్ర చికిత్స చేయించుకోవడంతో ఆటకు దూరంగా ఉన్నాడు. కోలుకున్న అతడు రంజీట్రోఫీ ద్వారా పునరాగమనం చేస్తాడని భావించారు. కానీ పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో కర్ణాటక, మధ్యప్రదేశ్‌లతో జరిగే రంజీ మ్యాచ్‌లకు షమిని బెంగాల్ జట్టుకు ఎంపిక చేయలేదు.
Updated Date - Nov 05 , 2024 | 03:45 AM