T20 Worldcup: రోహిత్ అద్భుతంగా పగ తీర్చుకున్నాడు.. ఆస్ట్రేలియాపై కెప్టెన్ ఇన్నింగ్స్‌పై అక్తర్ ప్రశంసలు!
ABN, Publish Date - Jun 25 , 2024 | 04:38 PM
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి జట్టును ముందుండి నడిపించాడు. ఈ నేపథ్యంలో టీమిండియాపై, రోహిత్‌పై పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ ప్రశంసల వర్షం కురిపించాడు
టీ20 ప్రపంచకప్ (T20 Worldcup)లో భాగంగా సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి జట్టును ముందుండి నడిపించాడు. ఈ నేపథ్యంలో టీమిండియాపై, రోహిత్‌పై పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) ప్రశంసల వర్షం కురిపించాడు. గతేడాది ప్రపంచకప్ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ఇప్పుడు ఇండియా ప్రతీకారం తీర్చుకుందని అన్నాడు (India vs Australia).
సోమవారం జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా సెమీస్‌లో అడుగుపెట్టింది. మొత్తం 41 బంతులు ఆడిన రోహిత్ శర్మ 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 92 పరుగులు చేసి పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ``గతేడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతుల్లో ఓడిన తర్వాత ఇండియా డిప్రెషన్ లోకి వెళ్లింది. కానీ ఇప్పుడది అబ్సెషన్ (ఓడించాలనే కసి)గా మారిపోయింది. రోహిత్ శర్మ తాను ఏం చేయాలో అదే చేశాడు. స్టార్క్ బౌలింగ్ లో అతడు ఆడిన తీరు అద్భుతం. అతడు 150 స్కోరు చేస్తాడని అనిపించింది`` అని అక్తర్ పేర్కొన్నాడు.
సోమవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగులు చేసింది. రోహిత్‌కు తోడు సూర్యకుమార్ (31), దూబే (28), హార్దిక్ (27 నాటౌట్) రాణించారు. అనంతరం ఛేజింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగులు చేసి ఓడింది. హెడ్ (43 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 76), మార్ష్ (37) మాత్రమే ఆకట్టుకున్నారు. ``ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్``గా రోహిత్ నిలిచాడు.
ఇవి కూడా చదవండి..
Rohit Sharma: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ఒకే రోజు మూడు రికార్డులను బ్రేక్ చేసిన రోహిత్ శర్మ!
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 25 , 2024 | 04:38 PM