ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL2024: ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఐపీఎల్ ఆటగాడి తండ్రి.. ఐపీఎల్ ఆ ఆటగాడి విలువ రూ.3.60 కోట్లు

ABN, Publish Date - Feb 22 , 2024 | 09:26 PM

ఐపీఎల్‌లో అడుగుపెట్టిన క్రికెటర్ల జీవితం దశ తిరుగుతుంది. క్రికెటర్ కెరియర్‌లోనే కాకుండా ఆర్థికంగానూ మరో స్థాయికి ఎదుగుతారు. కానీ ఈ ఏడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేస్తున్న ఓ ఆటగాడి తండ్రి మాత్రం ఇంకా సాదాసీదాగా ఓ ఎయిర్‌పోర్ట్ వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. కొడుకు ఉన్నతస్థాయికి ఎదిగినా ఇంకా కష్టపడుతున్న ఆయన ఎవరంటే.. ఐపీఎల్ వేలంపాటలో గుజరాత్ టైటాన్స్ ఏకంగా రూ.3.60 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన క్రికెట్ యువకెరటం రాబిన్స్ తండ్రి ఫ్రాన్సిస్ జేవియర్ మింజ్. కొడుకు రాత్రికి రాత్రే కోటీశ్వరుడైనా ఆయన మాత్రం ఇంకా సెక్యూరిటీగానే ఉద్యోగాన్ని చేస్తున్నారు.

ఐపీఎల్‌లో అడుగుపెట్టిన క్రికెటర్ల జీవితం దశ తిరుగుతుంది. క్రికెటర్ కెరియర్‌లోనే కాకుండా ఆర్థికంగానూ మరో స్థాయికి ఎదుగుతారు. కానీ ఈ ఏడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేస్తున్న ఓ ఆటగాడి తండ్రి మాత్రం ఇంకా సాదాసీదాగా ఓ ఎయిర్‌పోర్ట్ వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. కొడుకు ఉన్నతస్థాయికి ఎదిగినా ఇంకా కష్టపడుతున్న ఆయన ఎవరంటే.. ఐపీఎల్ వేలంపాటలో గుజరాత్ టైటాన్స్ ఏకంగా రూ.3.60 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన క్రికెట్ యువకెరటం రాబిన్స్ తండ్రి ఫ్రాన్సిస్ జేవియర్ మింజ్. కొడుకు రాత్రికి రాత్రే కోటీశ్వరుడైనా ఆయన మాత్రం ఇంకా సెక్యూరిటీగానే ఉద్యోగాన్ని చేస్తున్నారు.

ఇండియా, ఇంగ్లండ్ మధ్య శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న మ్యాచ్ కోసం ఇరు జట్లు రాంచీలోని బిర్సా ముండా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోగా.. ఆటగాళ్లను రాబిన్స్ తండ్రి జేవియర్ ఆసక్తిగా గమనించాడు. అరైవల్ హాల్ నుంచి గేట్ నుంచి బయటకు వెళ్లేవరకు సెక్యూరిటీ గార్డుగా అలా చూస్తుండిపోయారు.భారత క్రికెటర్లు అతడిని దాటి వెళ్తుండగా ఏదో ఒక రోజు ‘ నా కొడుకు రాబిన్ కూడా ఈ టీమ్‌లో ఉంటాడు’ అన్నట్టుగా చూశాడు.

‘‘ క్రికెటర్లు అందరూ విమానాశ్రయం నుంచి బయటకు రావడం నేను చూశాను. కానీ ఒక్కరు కూడా నన్ను చూడలేదు. అయినా వారు ఎందుకు చూడాలి?. నేను ఇక్కడ చాలా మంది సెక్యూరిటీ గార్డుల్లో ఒకడిని మాత్రమే. నా కొడుకు రాబిన్ ఇప్పుడే క్రికెటర్ కెరియర్ ప్రారంభించాడు. ప్రపంచమంతా అతడి పేరుని గుర్తుపెట్టుకుంటుంది. భారత్ తరపున ఆడేందుకు ఇంకా చాలా దూరం ఉంది’’ అని జేవియర్ అన్నారు. ఈ మేరకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో ఆయన మాట్లాడారు. తన కొడుకు ఐపీఎల్ కాంట్రాక్ట్‌ పొందినప్పటికీ టీమిండియా నుంచి పిలుపు అందాలంటే ఇంకా చాలా దూరంగా వెళ్లాల్సి ఉందని పేర్కొన్నారు. కాగా ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న తొలి గిరిజన క్రికెటర్‌గా జేవియర్ కొడుకు రాబిన్ నిలిచిన విషయం తెలిసిందే.


ఉద్యోగాన్ని వదులుకునే ఉద్దేశ్యం లేదు..

జేవియర్ దాదాపు రెండు దశాబ్దాలపాటు ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. తన కొడుకు రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయినప్పటికీ సెక్యూరిటీ గార్డు ఉద్యోగాన్ని వదులుకునే ఉద్దేశ్యం లేదని చెప్పాడు. ఐడెంటిటీ కార్డులేని వ్యక్తులను వెళ్లకుండా చూడడం తన విధి అని, ఎవరి దగ్గర తుపాకీతో ఉంటుందో చెప్పలేమని, ఒక్క తప్పు జరిగితే ఉద్యోగాన్ని పోగొట్టుకోవాల్సి ఉంటుందని జేవియర్ పేర్కొన్నారు. ‘‘ నా కొడుకు ఐపీఎల్ క్రికెటర్ అయినంత మాత్రాన నేను నిశ్చలంగా ఉండలేను. కొడుకుకు ఐపీఎల్ ఎంట్రీ లభించడంతో కుటుంబంలో ఆర్థిక భద్రత పెరిగిన మాట నిజమే. కానీ జీవితం ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేం. నా సహోద్యోగులు చాలా మంది ఇకపై డ్యూటీ చేయాల్సిన అవసరం ఏముందని అడిగారు. కానీ నేను పని చేయాలని అనుకున్నంత వరకు చేస్తూనే ఉంటాను. నేను ఆరోగ్యంగా ఉంటాను. నా కోసం నేను సంపాదించుకోకుంటే నాకు నిద్ర పట్టదు’’ జేవియర్ అన్నారు. కొడుకుతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నామని, రాబిన్ జీవన్ శైలిలో కూడా ఎలాంటి మార్పురాలేదని ఫ్రాన్సిస్ జేవియర్ తెలిపారు.

‘‘ మేమంతా ఇప్పటికీ అదే ఇంట్లో ఉంటున్నాం. నేను ఇప్పటికీ అదే బైక్ నడుపుతున్నాను. మంచి ఇంట్లోకి మారాలని లేదా కొత్త ఇల్లు కొనాలని మేము అనుకోవడం లేదు. అదృష్టవశాత్తూ రాబిన్ కూడా అలాగే ఉన్నాడు. బాగా కష్టపడాలని అతడికి తెలుసు. రాబిన్ ఇప్పటికీ మాకు పిల్లాడే’’ అని జేవియర్ పేర్కొన్నారు. తన కొడుకు రాబిన్ క్రికెట్ ప్రయాణంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఎనలేదని కొనియాడారు. ఐపీఎల్ వేలంలో రాబిన్‌ను ఎవరూ కొనుగోలు చేయకపోతే చెన్నై సూపర్ కింగ్స్ రాబిన్‌ను తీసుకుంటుందని ధోని తనకు హామీ ఇచ్చాడని ఫ్రాన్సిస్ జేవియర్ వెల్లడించారు.

ఇవి కూాడా చదవండి..

IPL 2024: ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్.. మార్చి 22న సీఎస్కే‌తో ఆర్సీబీ ఢీ

IPL2024: ఐపీఎల్ ప్రారంభానికి ముందు గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్.. వరల్డ్ కప్‌లో అదరగొట్టిన టీమిండియా ఆటగాడు దూరం!

మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 22 , 2024 | 09:27 PM

Advertising
Advertising