ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పొరపాటు పోస్ట్‌కు రవిశాస్త్రి సారీ!

ABN, Publish Date - Nov 03 , 2024 | 01:25 AM

టీమిండియా మాజీ కోచ్‌, వ్యాఖ్యాత రవిశాస్త్రి తాను చేసిన పొరపాటుకు బహిరంగ క్షమాపణ చెప్పాడు. అలనాటి భారత క్రికెటర్‌ నారీ కాంట్రాక్టర్‌ మరణించాడంటూ రవిశాస్త్రి ఎక్స్‌లో పోస్ట్‌ చేయడమే...

ముంబై: టీమిండియా మాజీ కోచ్‌, వ్యాఖ్యాత రవిశాస్త్రి తాను చేసిన పొరపాటుకు బహిరంగ క్షమాపణ చెప్పాడు. అలనాటి భారత క్రికెటర్‌ నారీ కాంట్రాక్టర్‌ మరణించాడంటూ రవిశాస్త్రి ఎక్స్‌లో పోస్ట్‌ చేయడమే దీనికి కారణం. మూడో టెస్ట్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న శాస్ర్తి శనివారం ఆట సమయంలో ఈ పొరపాటు ప్రకటన చేశాడు. దాంతో సోషల్‌మీడియాలో క్రికెట్‌ ఫ్యాన్స్‌ నుంచి కాంట్రాక్టర్‌ మృతికి సంతాపాలు వెల్లువెత్తాయి. అయితే తొలుత వచ్చిన వార్త నిజం కాదని, 90 ఏళ్ల కాంట్రాక్టర్‌ ఆరోగ్యంగానే ఉన్నారన్న వార్త వెలువడింది. వెంటనే తప్పు తెలుసుకున్న రవిశాస్త్రి ఆ పోస్ట్‌ను తొలగించాడు. ‘ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. పొరపాటుగా పోస్ట్‌ చేసినందుకు క్షమించాలి’ అని శాస్త్రి కోరాడు.

Updated Date - Nov 03 , 2024 | 01:25 AM