ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Euro final : నాలుగా.. ఒక్కటా..!

ABN, Publish Date - Jul 14 , 2024 | 06:33 AM

జైత్రయాత్ర కొనసాగిస్తున్న స్పెయిన్‌ రికార్డుస్థాయిలో నాలుగోసారి యూరో ఫుట్‌బాల్‌ చాంపియన్‌షి్‌ప నెగ్గాలనే పట్టుదలతో ఉండగా.. గత టోర్నీలో తుది మెట్టుపై తడబడిన

ఇంగ్లండ్‌తో స్పెయిన్‌ ఢీ

‘యూరో’ ఫైనల్‌ నేడే

రాత్రి 12.30 నుంచి సోనీలో..

బెర్లిన్‌: జైత్రయాత్ర కొనసాగిస్తున్న స్పెయిన్‌ రికార్డుస్థాయిలో నాలుగోసారి యూరో ఫుట్‌బాల్‌ చాంపియన్‌షి్‌ప నెగ్గాలనే పట్టుదలతో ఉండగా.. గత టోర్నీలో తుది మెట్టుపై తడబడిన ఇంగ్లండ్‌ తొలిసారి విజేతగా నిలవాలనే కసితో ఉంది. ఆదివారం రాత్రి జరిగే టైటిల్‌ ఫైట్‌లో జోరుమీదున్న స్పెయిన్‌తో ఇంగ్లండ్‌ అమీతుమీ తేల్చుకోనుంది. సెమీ్‌సలో బలమైన ఫ్రాన్స్‌ను ఓడించిన స్పెయిన్‌ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. కెప్టెన్‌ మొరాటా పూర్తి ఫిట్‌నె్‌సతో కనిపిస్తుండగా.. చిచ్చరపిడుగు యమల్‌పైనే అందరి దృష్టీ నెలకొనే అవకాశం ఉంది. ఓమ్లో కూడా ఫామ్‌లో ఉన్నాడు. మరోవైపు ఇంగ్లండ్‌ అద్భుత పోరాటపటిమను ప్రదర్శిస్తోంది. నాకౌట్‌ మ్యాచ్‌ల్లో వెనుకబడినా అద్భుతంగా పుంజుకొని విజయాలు అదుకొంటోంది. నెదర్లాండ్స్‌తో ఫైనల్‌ ఫోర్‌ మ్యాచ్‌లోనూ వెనుకంజలో నిలిచినా.. వాట్కిన్స్‌ లేటు గోల్‌తో జట్టును గెలిపించాడు. కెప్టెన్‌ హ్యారీ కేన్‌, బెలింగమ్‌, సాకా జట్టుకు కీలకం కానున్నారు.

Updated Date - Jul 14 , 2024 | 06:33 AM

Advertising
Advertising
<