ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పుణె టెస్టుకు స్పిన్‌ వికెట్‌!

ABN, Publish Date - Oct 22 , 2024 | 01:18 AM

కివీస్‌తో రెండో టెస్టు కోసం స్పిన్‌ అనుకూల వికెట్‌ను రూపొందిస్తున్నారు. మ్యాచ్‌ జరిగే పుణె పిచ్‌ను నల్లమట్టితో తయారు చేయడం వల్ల స్లో బౌలర్లకు సహకరిస్తుంది. తక్కువ బౌన్స్‌తోపాటు బంతి నెమ్మదిగా టర్న్‌ అయ్యే అవకాశం...

కివీస్‌తో రెండో టెస్టు కోసం స్పిన్‌ అనుకూల వికెట్‌ను రూపొందిస్తున్నారు. మ్యాచ్‌ జరిగే పుణె పిచ్‌ను నల్లమట్టితో తయారు చేయడం వల్ల స్లో బౌలర్లకు సహకరిస్తుంది. తక్కువ బౌన్స్‌తోపాటు బంతి నెమ్మదిగా టర్న్‌ అయ్యే అవకాశం ఉంది. బెంగళూరు ఓటమితో బెంబేలెత్తిన భారత్‌.. ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఎలాగైనా సిరీస్‌ సొంతం చేసుకోవాలంటే మిగిలిన రెండు టెస్టులు నెగ్గాలి. ఈ నేపథ్యంలో జట్టు స్పిన్‌ వికెట్‌తో ఫలితం సాధించాలనే వ్యూహంతో ఉన్నట్టు తెలుస్తోంది. మూడో టెస్టు జరిగే ముంబై వికెట్‌కు కూడా స్పిన్నర్లకు స్వర్గధామం కానుందట. అయితే, వాంఖడే వికెట్‌ ఎర్రమట్టితో తయారు చేయగా.. పుణె పిచ్‌ను నల్లమట్టితో రూపొందించారు. స్పిన్నర్ల ఆధిపత్యం కొనసాగనున్న నేపథ్యంలోఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ను 16వ ఆటగాడిగా బోర్డు ఎంపిక చేసింది. పుణెలో ఇప్పటి వరకు రెండు టెస్టులు జరిగాయి. 2016-17 బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో లెఫ్టామ్‌ స్పిన్నర్‌ ఓకీఫ్‌ 12 వికెట్లతో చెలరేగడంతో.. ఆస్ట్రేలియా 333 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది.


కాగా, 2019లో దక్షిణాఫ్రికాపై టీమిండియా ఇన్నింగ్స్‌ తేడాతో గెలిచింది. ఆ మ్యాచ్‌లో విరాట్‌ డబుల్‌ సెంచరీ చేశాడు. కాగా, ఇప్పుడు మ్యాచ్‌ జరిగే పిచ్‌పై పచ్చిక కనిపించడం లేదు. తొలి గంట ఆట తర్వాత సీమర్లకు ఏమాత్రం సహకరించే అవకాశం లేకపోయినా.. పొడిగా ఉండడంతో బౌలర్లు రివర్స్‌ స్వింగ్‌ రాబట్టే చాన్సులున్నాయి. దీంతో టాస్‌ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్‌ చేయడానికే మొగ్గుచూపవచ్చు.

Updated Date - Oct 22 , 2024 | 01:18 AM