ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గులాబీ టెస్ట్‌కు స్పోర్టింగ్‌ వికెట్‌

ABN, Publish Date - Dec 05 , 2024 | 06:20 AM

పింక్‌ బాల్‌ టెస్ట్‌లో భారత్‌ను దెబ్బకొట్టడానికి ఆతిథ్య జట్టు పేస్‌ వ్యూహాన్ని రచిస్తోంది. ఇందుకోసం వికెట్‌పై 6 మిల్లీమీటర్ల మందాన పచ్చికను ఉంచనుంది. శుక్రవారం నుంచి ఈ డే/నైట్‌ టెస్ట్‌ జరగనుంది...

సంధ్యా సమయంలో బ్యాటింగ్‌ కష్టమే

అడిలైడ్‌: పింక్‌ బాల్‌ టెస్ట్‌లో భారత్‌ను దెబ్బకొట్టడానికి ఆతిథ్య జట్టు పేస్‌ వ్యూహాన్ని రచిస్తోంది. ఇందుకోసం వికెట్‌పై 6 మిల్లీమీటర్ల మందాన పచ్చికను ఉంచనుంది. శుక్రవారం నుంచి ఈ డే/నైట్‌ టెస్ట్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో వికెట్‌ గురించి క్యూరేటర్‌ డామియన్‌ హో బుధవారం మీడియాకు కొన్ని వివరాలు వెల్లడించాడు. బంతి వేగంగా పాతబడకుండా ఉండేందుకు కొంతమేర గడ్డిని ఉంచుతున్నట్టు తెలిపాడు. ‘బ్యాట్‌కు బంతికి మధ్య సమ పోరాటం సాగేలా పిచ్‌ను రూపొందించే ప్రయత్నం చేశాం. వికెట్‌పై గడ్డి కారణంగా ఆరంభంలో పేసర్లకు అదనపు ప్రయోజనం లభించినా.. మ్యాచ్‌ సాగేకొద్దీ స్పిన్‌కు అనుకూలించనుంది. సంధ్యా సమయంలో బ్యాటింగ్‌ చేయడం సవాలుతో కూడుకున్నది. ఇక, ఫ్లడ్‌లైట్ల కింద గులాబీ బంతి మరింతగా స్వింగ్‌ కావచ్చు. అయితే, క్రీజులో పాతుకుపోయిన బ్యాటర్లుండి, కొత్త బంతికి దొరక్కపోతే మాత్రం బౌలర్లకు కష్టకాలమేన’ని హో చెప్పాడు. తొలి రోజు భారీవర్షానికి అవకాశముందన్నాడు. కాగా, 2020 టూర్‌లో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 36 పరుగులకే కుప్పకూలింది.


ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ

భారత జట్టు ప్రాక్టీస్‌ సెషన్స్‌ వీక్షణ కోసం ఇకముందు ఫ్యాన్స్‌ను అనుమతించకూడదనే నిర్ణయం తీసుకొన్నారు. మంగళవారం టీమిండియా ఆటగాళ్లను చూడడానికి 3 వేల మందికిపైగా అభిమానులు రావడంతో గందరగోళం నెలకొంది. భారత స్టార్లను చూసి ఫ్యాన్స్‌ అరుపులు, కేకలతో సందడి చేశారు. రోహిత్‌, పంత్‌లను సిక్స్‌లు కొట్టాలని గొడవ చేశారు. దీంతో ఆటగాళ్లు ఏకాగ్రత చెదిరి ఇబ్బందులు పడ్డారని బీసీసీఐ అధికారి తెలిపారు. ఇక, గుజరాతీలో ‘హాయ్‌’ చెప్పాలని కొందరు గిల్‌ను అడగగా..ఓ ఆటగాడిని బాడీ షేమింగ్‌ కూడా చేశారు. దీంతో ఫ్యాన్స్‌ను ప్రాక్టీస్‌ సెషన్లకు అనుమతించొద్దని నిర్ణయించారు.

Updated Date - Dec 05 , 2024 | 06:20 AM