ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తొలి టెస్టుకు గిల్‌ దూరం!

ABN, Publish Date - Nov 17 , 2024 | 05:47 AM

ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు ముందే భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్‌ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ గాయం కారణంగా పెర్త్‌ టెస్టుకు దూరం కానున్నాడు. ఇంట్రా స్క్వాడ్‌ వామప్‌ రెండో రోజు ఫీల్డింగ్‌లో గిల్‌

పెర్త్‌: ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు ముందే భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్‌ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ గాయం కారణంగా పెర్త్‌ టెస్టుకు దూరం కానున్నాడు. ఇంట్రా స్క్వాడ్‌ వామప్‌ రెండో రోజు ఫీల్డింగ్‌లో గిల్‌ ఎడమ చేతి బొటనవేలికి గాయమైంది. స్కానింగ్‌లో అతడి వేలికి ఫ్రాక్చర్‌ అయినట్టు తేలింది. దీంతో గిల్‌కు రెండు వారాల విశ్రాంతి అవసరమని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. అయితే డిసెంబరు 6 నుంచి జరిగే రెండో టెస్టులో మాత్రం ఆడే అవకాశం ఉంది. ఇప్పటికే రాహుల్‌ మోచేతికి గాయమైంది. అలాగే విరాట్‌ కూడా గాయపడి గురువారమే స్కానింగ్‌ తీయించుకున్నాడని చెబుతున్నారు.

స్వదేశంలోనే రోహిత్‌!

ముంబై: ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అందుబాటులో ఉండడం లేదు. శుక్రవారం అతడి భార్య రితిక మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దీంతో కుటుంబంతో మరికొన్ని రోజులు గడిపేందుకు రోహిత్‌ భారత్‌లోనే ఉండనున్నట్టు సమాచారం. రోహిత్‌ అభ్యర్ధనను బోర్డు అంగీకరించింది. దీంతో ఈ నెల 22 నుంచి పెర్త్‌లో జరిగే తొలి టెస్టుకు బుమ్రా నాయకత్వం వహించే అవకాశం ఉంది.

Updated Date - Nov 17 , 2024 | 05:47 AM