గాయంతోనే బరిలో దిగా
ABN, Publish Date - Aug 10 , 2024 | 06:33 AM
గాయం తనను బాధిస్తోందని, త్వరలో దానికి శస్త్రచికిత్స చేయించుకోనున్నట్టు స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా వెల్లడించాడు. గాయంతోనే తాను పారి్‌సలో అతి
నీరజ్ వెల్లడి
న్యూఢిల్లీ: గాయం తనను బాధిస్తోందని, త్వరలో దానికి శస్త్రచికిత్స చేయించుకోనున్నట్టు స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా వెల్లడించాడు. గాయంతోనే తాను పారి్‌సలో అతి కష్టంగా బరిలోకి దిగానని, అది ఎప్పుడు తీవ్రం అవుతుందోనన్న ఆందోళన కూడా వెంటాడిందని తెలిపాడు. ఒలింపిక్స్ డిఫెండింగ్ చాంపియన్ నీరజ్..పారిస్ క్రీడలకంటే ముందే తొడ కండరాల నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. అయినా సీజన్‌లో తన అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన చోప్రా, 89.45 మీ. దూరం జావెలిన్ విసిరి రజతం దక్కించుకున్నాడు. ‘గాయం గురించి ఆలోచిస్తూనే ఫైనల్లో ఈటెను విసిరా. ఎందుకంటే ఆ సమయంలో గాయపడకూడదు కదా. అందుకే ఫైనల్లో నాలో వేగం తగ్గింది. ఈ విషయాన్ని అంతా గమనించి ఉంటారు’ అని చోప్రా తెలిపాడు. ‘శస్త్ర చికిత్స చేయించుకోవాలని డాక్టర్ ఎప్పుడో సూచించాడు. కానీ వరల్డ్ చాంపియన్‌షి్‌ప ముందు, తర్వాత..ఆ విషయమై నిర్ణయం తీసుకోవడానికి నాకు సమయం లేదు. ఎందుకంటే..ఆపరేషన్ చేయించుకొన్న అనంతరం ఒలింపిక్స్‌కు సిద్ధం కావాలంటే చాలా సమయం పడుతుంది’ అని వివరించాడు.
Updated Date - Aug 10 , 2024 | 06:33 AM