ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

స్టొయినిస్‌.. ఒంటిచేత్తో..

ABN, Publish Date - Apr 24 , 2024 | 04:54 AM

మార్కస్‌ స్టొయినిస్‌ (63 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్స్‌లతో 124 నాటౌట్‌) మ్యాచ్‌ విన్నింగ్‌ శతకంతో.. డిఫెండింగ్‌ చాంప్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ మళ్లీ షాకిచ్చింది....

  • లఖ్‌నవూ అద్భుత విజయం

  • చెన్నైకు మళ్లీ షాక్‌

  • రుతురాజ్‌ శతకం వృథా

చెన్నై: మార్కస్‌ స్టొయినిస్‌ (63 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్స్‌లతో 124 నాటౌట్‌) మ్యాచ్‌ విన్నింగ్‌ శతకంతో.. డిఫెండింగ్‌ చాంప్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ మళ్లీ షాకిచ్చింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ 6 వికెట్లతో చెన్నైను ఓడించింది. తొలుత చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 210/4 స్కోరు చేసింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (60 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 108 నాటౌట్‌), శివమ్‌ దూబే (27 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 66) ఇన్నింగ్స్‌ వృథా అయ్యాయి. హెన్రీ, యశ్‌ ఠాకూర్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. ఛేదనలో లఖ్‌నవూ 19.3 ఓవర్లలో 4 వికెట్లకు 213 రన్స్‌ చేసి గెలిచింది. పూరన్‌ (15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34) రాణించాడు. పతిరన 2 వికెట్లు తీశాడు. స్టొయిని్‌సకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ దక్కింది.


తడబడి.. నిలబడి: ఛేదనలో లఖ్‌నవూ ఆరంభంలో తడబడినా.. స్టొయినిస్‌ ఒంటరి పోరాటంతో జట్టును గెలిపించాడు. పూరన్‌తో కలసి నాలుగో వికెట్‌కు 34 బంతుల్లో 70 పరుగుల భాగస్వామ్యంతో మ్యాచ్‌లో నిలిపాడు. మూడో బంతికే డికాక్‌ (0)ను దీపక్‌ డకౌట్‌ చేసి షాకిచ్చాడు. కానీ, కెప్టెన్‌ రాహుల్‌ (16), స్టొయినిస్‌ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. అయితే, ముస్తాఫిజుర్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడే క్రమంలో రాహుల్‌ వెనుదిరిగాడు. దీంతో రెండో వికెట్‌కు 33 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో పడిక్కల్‌ (13) సహకారంతో స్టొయినిస్‌ చెన్నై బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరు బోర్డును నడిపించడంతో.. పవర్‌ప్లే ముగిసే సరికి లఖ్‌నవూ 45/2తో నిలిచింది. కానీ, పడిక్కల్‌ను పతిరన బౌల్డ్‌ చేయడంతో.. మూడో వికెట్‌కు 55 పరుగుల పార్ట్‌నర్‌షి్‌పకు తెరపడింది. 88/3 ఇబ్బందుల్లో పడిన సమయంలో స్టొయిని్‌సకు పూరన్‌ అండగా నిలిచాడు. చివరి 5 ఓవర్లలో లఖ్‌నవూ విజయానికి 74 పరుగులు కావాల్సి ఉండగా.. పూరన్‌ 6,4,6తో బ్యాట్‌కు పనిచెప్పాడు. అయితే, కీలక సమయంలో పూరన్‌ను అవుట్‌ చేసిన పతిరన.. జట్టుకు కావాల్సిన బ్రేక్‌ను అందించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా పోరాటాన్ని కొనసాగించిన స్టొయినిస్‌ 18వ ఓవర్‌లో సెంచరీ పూర్తి చేసుకోగా.. దీపక్‌ హుడా (17 నాటౌట్‌) సిక్స్‌ బాదడంతో లక్ష్యం 12 బంతుల్లో 32కు దిగివచ్చింది. 19వ ఓవర్‌లో హుడా రెండు బౌండ్రీలతో 15 పరుగులు రాబట్టాడు. ఆఖరి ఓవర్‌లో 17 రన్స్‌ అవసరం కాగా.. స్టొయినిస్‌ 6,4,4,4తో ఫినిష్‌ చేశాడు.


ఆఖర్లో అదరగొట్టారు..: కెప్టెన్‌ రుతురాజ్‌ కళాత్మక బ్యాటింగ్‌.. డెత్‌లో దూబే పవర్‌ హిట్టింగ్‌తో చెన్నై భారీ స్కోరు సాధించింది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 46 బంతుల్లో 104 పరుగుల భాగస్వామ్యంతో జట్టు స్కోరును 200 మార్క్‌ దాటించారు. తొలి ఓవర్‌లో హెన్రీ బౌలింగ్‌లో రాహుల్‌ అద్భుత క్యాచ్‌తో ఓపెనర్‌ రహానె (1) వెనుదిరిగినా.. తుదికంటా ని1లిచిన గైక్వాడ్‌ కీలక భాగస్వామ్యాలతో జట్టును ఆదుకొన్నాడు. లైఫ్‌ దక్కినా సద్వినియోగం చేసుకోలేక పోయిన మిచెల్‌ (11)ను యశ్‌ పెవిలియన్‌ చేర్చడంతో.. పవర్‌ప్లేలో చెన్నై 49/2తో నిలిచింది. మధ్య ఓవర్లలో గైక్వాడ్‌, జడేజా (16) వీలుచిక్కినప్పుడల్లా షాట్లు కొడుతూ పరుగులు రాబట్టారు. కానీ, 12వ ఓవర్‌లో చెన్నై స్కోరు సెంచరీ దాటినా.. జడ్డూను క్యాచవుట్‌ చేసిన మొహిసిన్‌ మూడో వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఈ దశలో దూబే క్రీజులోకి రావడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. మరోవైపు గేర్‌ మార్చిన గైక్వాడ్‌ 6,4,4తో శతకం పూర్తి చేసుకొన్నాడు. ఎడాపెడా సిక్స్‌లతో హాఫ్‌ సెంచరీ సాధించిన దూబే రనౌట్‌ కాగా.. ధోనీ (4 నాటౌట్‌) బౌండ్రీతో ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు. మొత్తంగా చివరి 5 ఓవర్లలో లఖ్‌నవూ 75 పరుగులు సమర్పించుకొంది.

స్కోరుబోర్డు

చెన్నై: రహానె (సి) రాహుల్‌ (బి) హెన్రీ 1, రుతురాజ్‌ (నాటౌట్‌) 108, మిచెల్‌ (సి) హుడా (బి) యశ్‌ 11, జడేజా (సి) రాహుల్‌ (బి) మొహిసిన్‌ 16, శివమ్‌ దూబే (రనౌట్‌) 66, ధోనీ (నాటౌట్‌) 4, ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 210/4; వికెట్ల పతనం: 1-4, 2-49, 3-101, 4-205; బౌలింగ్‌: హెన్రీ 4-0-28-1, మొహిసిన్‌ 4-0-50-1, రవి బిష్ణోయ్‌ 2-0-19-0, యశ్‌ ఠాకూర్‌ 4-0-47-1, స్టొయినిస్‌ 4-0-49-0, క్రునాల్‌ పాండ్యా 2-0-15-0.

లఖ్‌నవూ: డికాక్‌ (బి) చాహర్‌ 0, రాహుల్‌ (సి) రుతురాజ్‌ (బి) ముస్తాఫిజుర్‌ 16, స్టొయినిస్‌ (నాటౌట్‌) 124, పడిక్కళ్‌ (బి) పతిరన 13, పూరన్‌ (సి) శార్దూల్‌ (బి) పతిరన 34, హుడా (నాటౌట్‌) 17, ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 19.3 ఓవర్లలో 213/4; వికెట్ల పతనం: 1-0, 2-33, 3-88, 4-158; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 2-0-11-1, తుషార్‌ 3-0-34-0, ముస్తాఫిజుర్‌ 3.3-0-51-1, శార్దూల్‌ 3-0-42-0, మొయిన్‌ అలీ 2-0-21-0, జడేజా 2-0-16-0, పతిరన 4-0-35-2.


పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

రాజస్థాన్‌ 8 7 1 0 14 0.698

కోల్‌కతా 7 5 2 0 10 1.206

హైదరాబాద్‌ 7 5 2 0 10 0.914

లఖ్‌నవూ 8 5 3 0 10 0.148

చెన్నై 8 4 4 0 8 0.415

గుజరాత్‌ 8 4 4 0 8 -1.055

ముంబై 8 3 5 0 6 -0.227

ఢిల్లీ 8 3 5 0 6 -0.477

పంజాబ్‌ 8 2 6 0 4 -0.292

బెంగళూరు 8 1 7 0 2 -1.046

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌

Updated Date - Apr 24 , 2024 | 06:06 AM

Advertising
Advertising