సుదర్శన్‌, పడిక్కళ్‌ అర్ధ శతకాలు

ABN, Publish Date - Nov 02 , 2024 | 06:41 AM

సాయి సుదర్శన్‌ (96 బ్యాటింగ్‌), పడిక్కళ్‌ (80 బ్యాటింగ్‌) అర్ధ శతకాలతో చెలరేగడంతో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుతో నాలుగు రోజుల మ్యాచ్‌లో భారత్‌ ‘ఎ’ పట్టు బిగించింది. సాయి సుదర్శన్‌, పడిక్కళ్‌ మూడో వికెట్‌కు

సుదర్శన్‌, పడిక్కళ్‌ అర్ధ శతకాలు

మాకే (ఆస్ట్రేలియా): సాయి సుదర్శన్‌ (96 బ్యాటింగ్‌), పడిక్కళ్‌ (80 బ్యాటింగ్‌) అర్ధ శతకాలతో చెలరేగడంతో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుతో నాలుగు రోజుల మ్యాచ్‌లో భారత్‌ ‘ఎ’ పట్టు బిగించింది. సాయి సుదర్శన్‌, పడిక్కళ్‌ మూడో వికెట్‌కు అభేద్యంగా 178 పరుగులు జోడించడంతో భారత్‌ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో శుక్రవారం ఆఖరికి 208/2 స్కోరు చేసింది. అంతకుముందు ఓవర్‌నైట్‌ 99/4 స్కోరుతో రెండో రోజు మొదటి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆస్ట్రేలియా ‘ఎ’ 195 పరుగులకు ఆలౌటైంది. ముకేశ్‌ ఆరు వికెట్లు తీయగా, ప్రసిద్ధ్‌ మూడు వికెట్లు సాధించాడు. కాగా..భారత్‌ ‘ఎ’ మొదటి ఇన్నింగ్స్‌లో 107 రన్స్‌ చేసింది.

Updated Date - Nov 02 , 2024 | 06:41 AM