ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సుమిత్‌ వచ్చేశాడు

ABN, Publish Date - Aug 17 , 2024 | 06:18 AM

భారత టెన్నిస్‌ సింగిల్స్‌ టాప్‌ ఆటగాడు సుమిత్‌ నగల్‌ డేవిస్‌ కప్‌ జట్టులోకి తిరిగొచ్చాడు. వచ్చేనెల 14, 15వ తేదీల్లో స్వీడన్‌తో భారత్‌ తలపడే వరల్డ్‌ గ్రూప్‌ 1 పోరుకు శుక్రవారం ప్రకటించిన జట్టులో నగల్‌ చోటు దక్కించుకున్నాడు. ఇటీవల

స్వీడన్‌తో డేవిస్ కప్‌కు భారత జట్టు

న్యూఢిల్లీ: భారత టెన్నిస్‌ సింగిల్స్‌ టాప్‌ ఆటగాడు సుమిత్‌ నగల్‌ డేవిస్‌ కప్‌ జట్టులోకి తిరిగొచ్చాడు. వచ్చేనెల 14, 15వ తేదీల్లో స్వీడన్‌తో భారత్‌ తలపడే వరల్డ్‌ గ్రూప్‌ 1 పోరుకు శుక్రవారం ప్రకటించిన జట్టులో నగల్‌ చోటు దక్కించుకున్నాడు. ఇటీవల ఇస్లామాబాద్‌ వేదికగా పాకిస్థాన్‌తో భారత్‌ ఆడిన డేవిస్‌ కప్‌ పోరుకు నగల్‌ దూరమైన సంగతి తెలిసిందే. ఇక, స్వీడన్‌తో పోరుకు సుమిత్‌తో పాటు రామ్‌కుమార్‌ రామనాథన్‌, శ్రీరామ్‌ బాలాజీ, నికీ పొనాచా, సిద్దార్థ్‌ విశ్వకర్మ భారత్‌ జట్టులో ఉన్నారు. ఆర్యన్‌ షాను రిజర్వ్‌ ఆటగాడిగా ఎంపికచేశారు. కాగా, డబుల్స్‌ స్పెషలిస్టు యుకీ భాంబ్రీ ఈ పోరు నుంచి తప్పుకొన్నాడు. దీంతో శ్రీరామ్‌ బాలాజీకి తోడుగా రామ్‌కుమార్‌ను డబుల్స్‌లో ఆడించే చాన్సుంది. సింగిల్స్‌లో కూడా రామ్‌కుమార్‌ తలపడతాడు. ఇక, జీషన్‌ అలీ స్థానంలో మాజీ ఆటగాడు అశుతోష్‌ సింగ్‌ కొత్త కోచ్‌గా వ్యవహరించనున్నాడు.

Updated Date - Aug 17 , 2024 | 06:18 AM

Advertising
Advertising
<