ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: వాళ్లకు పార్టీలు ఎక్కువ.. టైటిల్ గెలవని ఫ్రాంఛైజీలపై సురేష్ రైనా సంచలన వ్యాఖ్యలు!

ABN, Publish Date - Apr 22 , 2024 | 03:30 PM

ప్రస్తుతం ఐపీఎల్ 17వ సీజన్ జరుగుతోంది. కొన్ని జట్లు వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్నాయి. మరికొన్ని అపజయాలతో డీలా పడుతున్నాయి. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గని జట్లుగా బెంగళూరు, ఢిల్లీ, పంజాబ్, లఖ్‌నవూ నిలిచాయి. స్టార్ క్రికెటర్లు ఉన్నా ఈ నాలుగు జట్లు ఒక్కసారి కూడా కప్ కొట్టలేదు.

Suresh Raina

ప్రస్తుతం ఐపీఎల్ 17వ (IPL 2024) సీజన్ జరుగుతోంది. కొన్ని జట్లు వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్నాయి. మరికొన్ని అపజయాలతో డీలా పడుతున్నాయి. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గని జట్లుగా బెంగళూరు, ఢిల్లీ, పంజాబ్, లఖ్‌నవూ నిలిచాయి. స్టార్ క్రికెటర్లు ఉన్నా ఈ నాలుగు జట్లు ఒక్కసారి కూడా కప్ కొట్టలేదు. మరోవైపు ముంబై, చెన్నై ఐదేసి సార్లు ఛాంపియన్‌గా నిలిచాయి. రాజస్థాన్, హైదరాబాద్, కోల్‌కతా, గుజరాత్ వంటి జట్లు కూడా కప్‌ అందుకున్నాయి.


ఐపీఎల్‌లో ఒక్కసారి కూడా కప్ చేజిక్కించుకోని టీమ్‌ల గురించి మాజీ ఆటగాడు సురేష్ రైనా (Suresh Raina) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ``ఐపీఎల్‌లో మూడు, నాలుగు టీమ్‌లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. నిజానికి కొన్ని జట్లు ఎక్కువగా పార్టీలు చేసుకుంటుంటాయి. రాత్రంతా పార్టీలు చేసుకుంటే తర్వాతి రోజు మ్యాచ్‌కు ఎలా సన్నద్ధం కాగలరు. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు విపరీతంగా ఉంటాయి. అలాంటపుడు మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌ల్లో ఆడడానికి తగినంత విశ్రాంతి అవసరం. చెన్నై టీమ్ ఎప్పుడూ పార్టీలు ఇవ్వలేదు. అందుకే ఆ టీమ్ ఐదుసార్లు కప్ గెలిచింద``ని రైనా అన్నాడు.


ఇక, కోల్‌కతాతో మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్ మయాంక్ దగర్ ఒక ఓవర్లో 20 పరుగులు ఇవ్వడంపై ఆ టీమ్ కెప్టెన్ డుప్లెసిస్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మయాంక్ ఓవర్ తర్వాత తమపై ఒత్తిడి పెరిగిందని డుప్లెసిస్ వ్యాఖ్యానించాడు. ఆ వ్యాఖ్యలపై సురేష్ రైనా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ``డుప్లెసిస్, నేను కలిసి ఆడాం. అతడు నాకు మంచి స్నేహితుడు. కానీ, ఓ యువ ఆటగాడి గురించి అతడు అలా మాట్లాడడాన్ని నేను ఖండిస్తున్నా. రోహిత్ శర్మ అయితే అలా ఎప్పుడూ మాట్లాడడు`` అంటూ రైనా కామెంట్ చేశాడు.

ఇవి కూడా చదవండి..

IPL 2024: నేడు RR vs MI మ్యాచ్.. ఏ జట్టు గెలుస్తుందంటే


IPL 2024: అంపైర్లపై కోహ్లి ఆగ్రహం.. ఎందుకంటే..?


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 22 , 2024 | 03:30 PM

Advertising
Advertising