సూర్యకే పగ్గాలు

ABN, Publish Date - Jul 19 , 2024 | 03:42 AM

భారత టీ20 జట్టు కొత్త కెప్టెన్‌గా డాషింగ్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ను ఎంపికచేశారు. లంకతో టీ20, వన్డే సిరీ్‌సలకు భారత జట్లను గురువారం బీసీసీఐ ప్రకటించింది. పొట్టి వరల్డ్‌కప్‌ తర్వాత విశ్రాంతిలో ఉన్న రోహిత్‌, విరాట్‌ కోహ్లీ వన్డే జట్టులోకి వచ్చారు...

సూర్యకే పగ్గాలు

  • శుభ్‌మన్‌కు వైస్‌ కెప్టెన్సీ

  • వన్డేలకు రోహిత్‌, కోహ్లీ

  • లంక టూర్‌కు భారత జట్లు

న్యూఢిల్లీ: భారత టీ20 జట్టు కొత్త కెప్టెన్‌గా డాషింగ్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ను ఎంపికచేశారు. లంకతో టీ20, వన్డే సిరీ్‌సలకు భారత జట్లను గురువారం బీసీసీఐ ప్రకటించింది. పొట్టి వరల్డ్‌కప్‌ తర్వాత విశ్రాంతిలో ఉన్న రోహిత్‌, విరాట్‌ కోహ్లీ వన్డే జట్టులోకి వచ్చారు. ఈ నెల 27 నుంచి శ్రీలంకతో జరిగే మూడు టీ20ల సిరీస్‌ నుంచి ఫుల్‌టైమ్‌ సారథిగా సూర్య ప్రయాణం ఆరంభం కానుంది. ఇక మూడు వన్డేల సిరీస్‌ వచ్చే నెల 2 నుంచి జరగనుంది. రాహుల్‌ ద్రవిడ్‌ తర్వాత కోచ్‌గా నియమితుడైన గౌతమ్‌ గంభీర్‌ ఇదే తొలి సిరీస్‌. శుభ్‌మన్‌ గిల్‌ను వైస్‌ కెప్టెన్‌గా ప్రకటించారు. టీ20 ఫార్మాట్‌కు రోహిత్‌ వీడ్కోలు పలకడంతో.. హార్దిక్‌ పాండ్యాకు పగ్గాలు అప్పగిస్తారని భావించారు. కానీ, హార్దిక్‌కు టీమ్‌ పగ్గాలు అప్పజెప్పేందుకు కొత్త కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌, చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ ఆసక్తి కనబర్చలేదు. 2026 పొట్టిక్‌పను దృష్టిలో ఉంచుకొని జట్టు ను తయారు చేస్తున్న విషయాన్ని పాండ్యాకు అర్థమయ్యే విధంగా చెప్పినట్టు సమాచారం. టీ20లు ఆడేందుకు అంగీకరించిన హార్దిక్‌.. వ్యక్తిగత కారణాలతో వన్డే సిరీ్‌సకు దూరమయ్యాడు.


రియాన్‌ పరాగ్‌, ఢిల్లీ పేసర్‌ హర్షిత్‌ రాణాకు 50 ఓవర్ల ఫార్మాట్‌లో తొలిసారి చోటు దక్కింది. కాగా, శ్రేయాస్‌ అయ్యర్‌ అనూహ్యంగా వన్డే టీమ్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నిలిపి వేయడంతో అయ్యర్‌ అంతర్జాతీయ కెరీర్‌ ముగిసిందని భావించారు. కానీ, గౌతీతో ఉన్న సాన్నిహిత్యం శ్రేయాస్‌ కెరీర్‌కు ఒకరకంగా ఊపిరిలూదింది.

టీ20 జట్టు

సూర్యకుమార్‌ (కెప్టెన్‌), గిల్‌ (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, రింకూ సింగ్‌, రియాన్‌ పరాగ్‌, రిషభ్‌ పంత్‌, శాంసన్‌, హార్దిక్‌, శివమ్‌ దూబే, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ఖలీల్‌ అహ్మద్‌, సిరాజ్‌.

వన్డే జట్టు

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), గిల్‌ (వైస్‌ కెప్టెన్‌), కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, పంత్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, శివమ్‌ దూబే, కుల్దీప్‌ యాదవ్‌, సిరాజ్‌, సుందర్‌, అర్ష్‌దీప్‌, రియాన్‌ పరాగ్‌, అక్షర్‌, ఖలీల్‌, హర్షిత్‌ రాణా.

Updated Date - Jul 19 , 2024 | 03:42 AM

Advertising
Advertising
<