ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్‌?

ABN, Publish Date - Jul 17 , 2024 | 05:50 AM

భారత టీ20 జట్టు కెప్టెన్‌ ఎంపికపై జాతీయ సెలెక్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. టీ20 వరల్డ్‌క్‌పలో వైస్‌కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్‌ పాండ్యానే కెప్టెన్‌గా కొనసాగిస్తారని అంతా భావించినా...

వన్డే సిరీ్‌సకు హార్దిక్‌ దూరం

న్యూఢిల్లీ: భారత టీ20 జట్టు కెప్టెన్‌ ఎంపికపై జాతీయ సెలెక్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. టీ20 వరల్డ్‌క్‌పలో వైస్‌కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్‌ పాండ్యానే కెప్టెన్‌గా కొనసాగిస్తారని అంతా భావించినా.. కోచ్‌ గంభీర్‌, చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ ఆలోచనలు మరోలా ఉన్నాయి. పాండ్యా ఫిట్‌నెస్‌ సమస్యలను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు దీర్ఘకాలిక ప్రయోజనాల రీత్యా డాషింగ్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌వైపే వీరు మొగ్గు చూపుతున్నారు. ఈనెలాఖరున ఆరంభమయ్యే శ్రీలంక సిరీస్‌తో పాటు 2026 టీ20 మెగా టోర్నీ వరకు సూర్యకే పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఇప్పటికే హార్దిక్‌కు కూడా చెప్పినట్టు సమాచారం. గతేడాది సూర్య ఆసీస్‌, దక్షిణాఫ్రికాలపై ఎనిమిది మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యహరించిన అనుభవం ఉంది. అలాగే తను డ్రెస్సింగ్‌రూమ్‌లో సహచరులతో కలివిడిగా ఉంటాడనే పేరుంది. మరోవైపు లంకతో వన్డే సిరీ్‌సకు పాండ్యా వ్యక్తిగత కారణాలతో అందుబాటులో ఉండడం లేదు.


స్టార్‌ క్రికెటర్లు దేశవాళీల్లో ఆడాల్సిందే..

స్టార్‌ క్రికెటర్లు కూడా దేశవాళీ టోర్నీలకు అందుబాటులో ఉండాలని బీసీసీఐ కార్యదర్శి జైషా స్పష్టం చేశాడు. అయితే రోహిత్‌, విరాట్‌, బుమ్రా మాత్రం వారికిష్టమైతే ఆడవచ్చని తెలిపాడు. ఇతర టెస్టు స్పెషలిస్టులు మాత్రం దులీప్‌ ట్రోఫీలో కనీసం ఓ మ్యాచ్‌లోనైనా ఆడాల్సిందేనన్నాడు. ఈసారి దులీప్‌ ట్రోఫీ ఆటగాళ్లను జోనల్‌ సెలెక్షన్‌ కమిటీ కాకుండా జాతీయ సెలెక్షన్‌ కమిటీనే ఎంపిక చేయనుంది.

Updated Date - Jul 17 , 2024 | 05:50 AM

Advertising
Advertising
<