IPL : ఆరుగురితో రిటైన్ పాలసీ
ABN, Publish Date - Sep 29 , 2024 | 06:23 AM
ఐపీఎల్ మెగా వేలం రిటెన్షన్ విధానంపై నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. ప్రతీ జట్టు గరిష్ఠంగా ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. ఇందులో కనీసం ఓ అన్‌క్యా్‌ప్డ ప్లేయర్ ఉండాల్సిందే.
ఫ్రాంచైజీ పర్స్ విలువ రూ. 120 కోట్లు
ఆటగాళ్ల మ్యాచ్ ఫీజు రూ. 7.50 లక్షలు
ఇంపాక్ట్ ప్లేయర్ కొనసాగింపు
ఐపీఎల్‌పై పాలకమండలి నిర్ణయాలు
బెంగళూరు: ఐపీఎల్ మెగా వేలం రిటెన్షన్ విధానంపై నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. ప్రతీ జట్టు గరిష్ఠంగా ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. ఇందులో కనీసం ఓ అన్‌క్యా్‌ప్డ ప్లేయర్ ఉండాల్సిందే. అలాగే వీరందరినీ వేలానికి ముందే అట్టిపెట్టుకోవడమా? రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) ద్వారా తీసుకోవడమా? లేక ఈ రెండు పద్దతుల ద్వారా కొనసాగించడమా? అనేది ఆయా ఫ్రాంచైజీలదే తుది నిర్ణయం. 2022లో జరిగిన ఆటగాళ్ల వేలంలో నలుగురిని మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం కల్పించారు. అయితే ఫ్రాంచైజీల సూచన మేరకు ఈసారి మెగా వేలంలో మాత్రం అదనంగా మరో ఆటగాడిని చేర్చింది. ఇదిలావుండగా గత సీజన్ నుంచి కొనసాగుతున్న ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను మున్ముందు కూడా అమలు చేయనున్నారు. అంతేకాకుండా.. వేలంలో ఏదైనా జట్టు కొనుగోలు చేసిన ఆటగాడు ఆ తర్వాత తాను లీగ్‌కు అందుబాటులో ఉండలేనని చెబితే మాత్రం అతడిపై రెండు సీజన్ల నిషేధం విధించనున్నారు. శనివారం జరిగిన ఐపీఎల్ పాలక మండలిలో వేలానికి సంబంధించి పలు నిర్ణయాలను తీసుకున్నారు.
సాలరీ క్యాప్ రూ.120 కోట్లు
మెగా వేలంలో పది ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు (సాలరీ క్యాప్) ఖర్చు చేసే మొత్తాన్ని కూడా రూ.120 కోట్లకు పెంచారు. నిరుడు మినీ వేలంలో ఈ మొత్తం రూ.100 కోట్లుగా ఉండింది. దీంతో ఈసారి వేలం రాకెట్ వేగంతో దూసుకెళ్లనుందనే అంచనాలున్నాయి.
రిటెన్షన్ ఖర్చు రూ.75 కోట్లు
మరోవైపు రిటెన్షన్ ఆటగాళ్ల మొత్తానికి సంబంధించి కూడా బీసీసీఐ స్పష్టమైన నిబంధన విధించింది. దీని ప్రకారం తొలి రిటెన్షన్ ఆటగాడికి రూ.18 కోట్లు, రెండో ఆటగాడికి రూ.14 కోట్లు, మూడో ఆటగాడికి రూ.11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఏదైనా ఫ్రాంచైజీ మరో ఇద్దరిని కూడా కొనసాగించాలనుకుంటే మాత్రం.. నాలుగో ప్రాధాన్య ప్లేయర్‌కు కూడా రూ.18 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఐదో ఆటగాడికి రూ.14 కోట్లు ఇవ్వక తప్పదు. దీన్ని బట్టి రిటెన్షన్ పాలసీని పూర్తి స్థాయిలో వినియోగించుకున్న జట్టు రూ.75 కోట్లు వేలానికి ముందే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా తమ సాలరీ క్యాప్ రూ.120 కోట్ల నుంచి వినియోగించుకోవాల్సి ఉంటుంది. అంటే.. మిగిలిన రూ.45 కోట్లతోనే ఆర్‌టీఎం, ఇతర 15 మంది ప్లేయర్లను కొనుగోలు చేయాలి. దీంతో స్టార్ ఆటగాళ్లతో కూడిన ఆయా ఫ్రాంచైజీలు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఆటగాళ్లకు అదనపు ఆదాయం
ఐపీఎల్ ఆటగాళ్లకు బీసీసీఐ నుంచి మరో తీపికబురు అందింది. తొలిసారిగా ఈ లీగ్‌లో ఆడే ఆటగాళ్లకు కూడా మ్యాచ్ ఫీజు కింద ప్రతీ మ్యాచ్‌కు రూ.7.50 లక్షలు ఇవ్వనున్నట్టు బోర్డు కార్యదర్శి జైషా ప్రకటించాడు. ఇందుకోసం ప్రతీ ఫ్రాంచైజీకి రూ.12.60 కోట్లను కేటాయిస్తున్నట్టు తెలిపాడు. ఒకవేళ సీజన్‌లో ప్రతీ మ్యాచ్ ఆడిన ప్లేయర్‌కు కోటీ 5 లక్షల రూపాయలు అందుకుంటాడు. ఇది తన ఫ్రాంచైజీ అందించే కాంట్రాక్ట్ మొత్తానికి అదనం కానుంది. మరోవైపు వేలంలో తక్కువ ధర పలికి.. మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన కనబరిచే ఆటగాళ్లకు బోర్డు తాజా నిర్ణయం ఆర్థికంగా లబ్ధి చేకూర్చనుంది.
అన్‌క్యా్‌పడ్డ్ ప్లేయర్ కూడా..
2021 తర్వాత అన్‌క్యా్‌ప్డ ప్లేయర్ రూల్‌ను కూడా అమలు చేయనున్నారు. గత ఐదేళ్లకాలంలో అంతర్జాతీయ క్రికెట్ ఆడని స్వదేశీ ఆటగాడిని ఈ రూల్ కింద పరిగణించవచ్చని పేర్కొంది. అలాగే బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా ఉండకూడదు. ఈ రూల్ ప్రకారం ఎంఎస్ ఽధోనీని సీఎ్‌సకే అన్‌క్యా్‌ప్డ ప్లేయర్ కింద జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అతడికి కేవలం రూ.4 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.
Updated Date - Sep 29 , 2024 | 06:23 AM