బంగ్లా పోటీనిచ్చేనా?
ABN, Publish Date - Oct 09 , 2024 | 06:17 AM
ఇక్కడి బ్యాటింగ్ పిచ్‌పై సూపర్ ఫామ్‌లో ఉన్న భారత బ్యాటర్లను నిలువరించాలంటే బంగ్లా బౌలర్లు చెమటోడ్చాల్సిందే. వెటరన్ ప్లేయర్ మహ్మదుల్లాకు పొట్టి ఫార్మాట్‌లో ఇదే చివరి సిరీస్ కానుంది.
నేడు రెండో టీ20
న్యూఢిల్లీ: భారత పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ జట్టు ఇప్పటి వరకు పెద్దగా పోటీ ఇచ్చింది లేదు. టెస్టు సిరీ్‌సను కోల్పోవడంతో పాటు పొట్టి ఫార్మాట్‌ను కూడా పేలవంగా ఆరంభించింది. అటు ఆతిథ్య టీమిండియా మాత్రం రెట్టించిన ఉత్సాహంతో మరో సిరీ్‌సపై కన్నేసింది. సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువ ఆటగాళ్లతో జట్టును ఎంపిక చేసినా.. బంగ్లాపై తొలి టీ20లో అన్ని విభాగాల్లోనూ పైచేయి సాధించింది. ఈనేపథ్యంలో ఇరు జట్ల మధ్య నేడు కీలక రెండో టీ20 జరుగనుంది. కోచ్ గంభీర్ సొంత మైదానంలో మరో మ్యాచ్ ఉండగానే చక్కటివిజయంతో సిరీస్ అందుకోవాలని సూర్యకుమార్ సేన తాపత్రయపడుతోంది. పర్యాటక జట్టు మాత్రం గెలుపే ధ్యేయంగా బరిలోకి దిగనుంది. ఎందుకంటే ఇక్కడ గెలిస్తేనే సిరీ్‌సలో సజీవంగా ఉంటుంది.
అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా..: ఈ సిరీ్‌సలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజూ శాంసన్ ఆకట్టుకున్నాడు. 2015లో అరంగేట్రం చేసినా నిలకడలేమితో జట్టులోకి వస్తూపోతూ ఉన్న సంజూ చక్కటి స్ట్రోక్‌ప్లేతో పవర్‌ప్లేలో చెలరేగాడు. మరో ఓపెనర్ అభిషేక్‌తో కలిసి నేటి మ్యాచ్‌లో మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చాలనుకుంటున్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ ధనాధన్ బ్యాటింగ్‌తో చెలరేగుతుండగా.. హార్దిక్ అటు బంతితో ఇటు బ్యాటుతో రాణిస్తున్నాడు. యువ పేసర్ మయాంక్ యాదవ్ అరంగేట్రంలోనే అదుర్స్ అనిపించుకున్నాడు. అర్ష్‌దీప్ ఆరంభం.. చివర్లో వికెట్లు నేలకూల్చడంతో బంగ్లా స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఇక మూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లతో వెన్నువిరిచాడు. ఈ మ్యాచ్‌లోనూ అతడు రాణిస్తే బంగ్లా బ్యాటర్లకు తిప్పలు తప్పవు.
ఒత్తిడిలో బంగ్లా: ఇక్కడి బ్యాటింగ్ పిచ్‌పై సూపర్ ఫామ్‌లో ఉన్న భారత బ్యాటర్లను నిలువరించాలంటే బంగ్లా బౌలర్లు చెమటోడ్చాల్సిందే. వెటరన్ ప్లేయర్ మహ్మదుల్లాకు పొట్టి ఫార్మాట్‌లో ఇదే చివరి సిరీస్ కానుంది. దీంతో అతడికి ఘనంగా ఫేర్‌వెల్ ఇవ్వాలనుకుంటే జట్టు ఈ మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది. అదీగాకుండా గతంలో అరుణ్ జైట్లీ స్టేడియంలోనే భారత్‌పై ఏకైక టీ20 విజయాన్ని బంగ్లా సాధించింది. ఆ ఉత్సాహంతో మరోసారి గెలుపు రుచి చూడాలనుకుంటోంది. బ్యాటింగ్‌లో మిరాజ్, షంటో మాత్రమే రాణిస్తుండగా, లిట్టన్ జట్టుకు శుభారంభాన్ని అందివ్వాల్సి ఉంది. ఇక బౌలర్లంతా తొలి టీ20లో ధారాళంగా పరుగులిచ్చుకున్నారు.
సూర్యకుమార్ మరో 39 పరుగులు సాధిస్తే టీ20ల్లో అత్యంత వేగం (73 మ్యాచ్‌లు)గా 2500 రన్స్ పూర్తి చేసిన రెండో బ్యాటర్‌గా కోహ్లీ రికార్డును సమం చేస్తాడు. బాబర్ ఆజమ్ (67) టాప్‌లో ఉన్నాడు.
పిచ్
అరుణ్ జైట్లీ స్టేడియం సహజంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంటుంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఇక్కడ జరిగిన ఐదు మ్యాచ్‌ల్లోనూ 200+ పరుగులు నమోదయ్యాయి.
తుది జట్లు (అంచనా)
భారత్: అభిషేక్, శాంసన్, సూర్యకుమార్ (కెప్టెన్), నితీశ్ కుమార్, హార్దిక్, రియాన్, రింకూ సింగ్, వాషింగ్టన్,వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్, మయాంక్ యాదవ్.
బంగ్లాదేశ్: లిట్టన్ దాస్, పర్వేజ్ హొస్సేన్, షంటో (కెప్టెన్), తౌహీద్, మహ్మదుల్లా, జకీర్ అలీ, మిరాజ్, రిషాద్, తన్జీమ్ హసన్, టస్కిన్, ముస్తాఫిజుర్, షోరిఫుల్.
Updated Date - Oct 09 , 2024 | 06:17 AM