T20 World Cup : చరిత్ర ముంగిట..
ABN, Publish Date - May 30 , 2024 | 06:36 AM
డిఫెండింగ్ చాంప్ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా గ్రూప్-బిలో ప్రధాన జట్లు. 2022లో టీ20 కప్ నెగ్గిన ఇంగ్లండ్, టైటిల్ నిలబెట్టుకొని చరిత్ర సృష్టించాలనే పట్టుదలతో ఉండగా.. టెస్ట్ చాంపియన్‌షి్‌ప, వన్డే ప్రపంచకప్ నెగ్గిన కంగారూలు ఇక్కడా అదే ఫలితంతో అరుదైన రికార్డు నెలకొల్పాలనే
రసవత్తరంగా గ్రూప్ ‘బి’
మరో 3 రోజుల్లో
(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)
డిఫెండింగ్ చాంప్ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా గ్రూప్-బిలో ప్రధాన జట్లు. 2022లో టీ20 కప్ నెగ్గిన ఇంగ్లండ్, టైటిల్ నిలబెట్టుకొని చరిత్ర సృష్టించాలనే పట్టుదలతో ఉండగా.. టెస్ట్ చాంపియన్‌షి్‌ప, వన్డే ప్రపంచకప్ నెగ్గిన కంగారూలు ఇక్కడా అదే ఫలితంతో అరుదైన రికార్డు నెలకొల్పాలనే సంకల్పంతో ఉన్నారు. ఇక,ఈ గ్రూప్‌లోని పసికూనలు నమీబియా, ఒమన్, స్కాట్లాండ్ జట్లు ఈసారి టోర్నీలో తమదైన ముద్ర వేయాలన్న ధీమాతో బరిలోకి దిగుతున్నాయి.
ఇంగ్లండ్
2010, 2022లో విజేతగా నిలిచిన ఇంగ్లండ్.. మూడోసారి పొట్టి కప్ గెలిచి రికార్డు సృష్టించాలనుకొంటోంది. బట్లర్ సారథ్యంలోని ఇంగ్లండ్ మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. బట్లర్, సాల్ట్, విల్ జాక్స్, బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్ లాంటి వారితో బ్యాటింగ్ బలంగా ఉంది. మార్క్ ఉడ్ లేకపోవడంతో బౌలింగ్ కొంత బలహీనంగా కనిపిస్తున్నా..ఆర్చర్‌తో ఆ లోటు భర్తీ అవుతుందని జట్టు భావిస్తోంది. మొయిన్ అలీ, లివింగ్‌స్టోన్ స్పిన్ ఆల్‌రౌండర్లుగా కీలకపాత్ర పోషించగలరు. అయితే, బ్యాటింగ్ ఆర్డర్‌లో టాప్-6లో ఒక్క లెఫ్ట్‌హ్యాండర్ కూడా లేకపోవడం కొంత ఆందోళకు గురి చేసే అంశం. అంతేకాకుండా టాపార్డర్ విఫలమైతే.. వికెట్ల పతనాన్ని అడ్డుకోగలిగే ఆటగాడు మిడిలార్డర్‌లో కనిపిస్తుండకపోవడం ఆ జట్టుకు పెద్ద లోటు.
ఆస్ట్రేలియా
2021లో కప్పు కొట్టిన ఆస్ట్రేలియా.. 2022లో సెమీస్‌కు కూడా చేరుకోలేకపోయింది. కానీ, ఐసీసీ ఈవెంట్లలో కంగారూలకున్న సక్సెస్ రేట్ ఏ జట్టూకు లేదు. తీవ్ర ఒత్తిడి నెలకొన్న ఫైనల్లో ఎంతో సులువుగా టైటిల్ ఎగరేసుకుపోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇలాగే గతేడాది వన్డే వరల్డ్‌కప్‌లో విజేతగా నిలిచారు కూడా. ఈ నేపథ్యంలో ఆసీస్‌ను ఏ దశలోనూ తేలిగ్గా తీసుకొనే వీలులేదు. పైగా ప్రస్తుతం జట్టులో ప్రధాన ఆటగాళ్లు చక్కని ఫామ్‌లో ఉన్నారు. పేసర్లు కమిన్స్, స్టార్క్ ఐపీఎల్‌లో సత్తాచాటారు. ట్రావిస్ హెడ్ తనదైన రోజున ఎంత టి విధ్వంసం సృష్టించగలడో ఐపీఎల్‌లో చూశాం. ఆల్‌రౌండర్లుగా మ్యాక్స్‌వెల్, కెప్టెన్ మార్ష్, స్టొయినిస్, గ్రీన్ జట్టును ఆదుకోగల సమర్థులు. అయితే, స్పిన్ విభాగం కొంత బలహీనంగా కనిపిస్తోంది.
నమీబియా
ఇటీవలి కాలంలో వేగంగా ఎదుగుతున్న జట్లలో నమీబియా ఒకటి. గత టోర్నీలో శ్రీలంకకు షాకిచ్చి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆఫ్రికా రీజినల్ క్వాలిఫయర్ స్టేజ్‌లో అద్భుత ప్రదర్శనతో మెగా ఈవెంట్ టికెట్ పట్టేసింది.్జ జింబాబ్వే, ఉగాండా లాంటి జట్లను కూడా ఓడించింది. గెరార్డ్ ఎరాస్మస్ నాయకత్వలోని నమీబియా జట్టులో డేవిడ్ వీస్ ప్రధాన ఆటగాడు.
ఒమన్
ఈ గ్రూప్‌లో ఉన్న ఏకైక ఆసియా జట్టు ఒమన్. మూడోసారి మెగా ఈవెంట్ బరిలోకి దిగుతోంది. మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకోవాలనేదే ఈ జట్టు లక్ష్యం. గతంలో తమనఉ రెండుసార్లు ఓడించిన నమీబియాతో తొలి మ్యాచ్ ఆడనుంది. కెప్టెన్ ఆకిబ్ ఇల్యాస్ టాపార్డర్‌లో అదరగొట్టడంతోపాటు స్పిన్నర్ కూడా.
స్కాట్లాండ్
తొలిసారి టీ20 కప్‌లో ఆడుతున్న రిచీ బెర్రింగ్టన్ సారథ్యం లోని స్కాట్లాండ్‌లో ప్రాంచైజీ లీగ్‌లు ఆడే సభ్యులుండడం జట్టుకు ప్లస్. పెద్దగా ఆశలు లేకపోయినా.. మెరుగైన ప్రదర్శనతో ఏదో ఒక సంచలనం సృష్టించాలనుకొంటోంది. 2018లో జరిగిన వన్డేల్లో ఇంగ్లండ్‌ను ఓడించి ఔరా అనిపించింది. లెఫ్టామ్ స్పిన్నర్ మార్క్ వాట్ జట్టులో కీలక ఆటగాడు.
Updated Date - May 30 , 2024 | 06:36 AM