ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పీఠం ఎవరిదో?

ABN, Publish Date - Nov 21 , 2024 | 06:00 AM

తెలంగాణ ఒలింపిక్‌ సంఘం (టీఓఏ) ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. గురువారం ఉద యం 11 గంటలకు సర్వసభ్య సమావేశం, అనంతరం 12 నుంచి

నేడే తెలంగాణ ఒలింపిక్‌ సంఘం ఎన్నికలు

అధ్యక్ష బరిలో చాముండి, జితేందర్‌ రెడ్డి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): తెలంగాణ ఒలింపిక్‌ సంఘం (టీఓఏ) ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. గురువారం ఉద యం 11 గంటలకు సర్వసభ్య సమావేశం, అనంతరం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పో లింగ్‌ జరగనుంది. అధ్యక్ష స్థానానికి రాష్ట్ర బ్యాడ్మింటన్‌ సంఘం ఉపాధ్యక్షుడు వి.చాముండేశ్వరనాథ్‌, మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి పోటీపడుతున్నారు. ప్రధాన కార్యదర్శి పదవికి సైక్లింగ్‌ సంఘం అధ్యక్షుడు పి.మల్లారెడ్డి, బాక్సింగ్‌ సంఘం అధ్యక్షుడు సీహెచ్‌.బాబూరావు, కోశాధికారి పదవికి సతీష్‌, ప్రదీప్‌ బరిలో ఉన్నారు. 4 ఉపాధ్యక్ష, సంయుక్త కార్యదర్శులు, 15 మంది ఈసీ సభ్యుల పదవులకు ఒక్కొక్క నామినేషనే దాఖలవడంతో వీరి ఎన్నిక లాంఛనం కానుంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్‌పై తెలంగాణ బాక్సింగ్‌ సంఘం హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టును ఆశ్రయించడంతో పోలింగ్‌ పూర్తయ్యాక ఫలితాలు ప్రకటించకుండా న్యాయస్థానం మధ్యంతర స్టే ఉత్తర్వులను ఇచ్చింది. ఇక, తెలంగాణ ఒలింపిక్‌ సంఘం ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర బ్యాడ్మింటన్‌ సంఘం పేరిట చలామణి అవుతున్న నకిలీ ఈ-మెయిళ్లను నమ్మవద్దని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి, జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ కోరాడు.

Updated Date - Nov 21 , 2024 | 06:00 AM