Tennis : టెన్నిస్ త్రయం.. తెచ్చేనా పతకం?
ABN, Publish Date - Jul 23 , 2024 | 06:29 AM
ఒలింపిక్స్‌లో ఈసారి భారత్‌కు పతకం లభించే క్రీడాంశంలో టెన్నిస్ కూడా ఉందనడంలో సందేహం లేదు. పురుషుల డబుల్స్‌లో 44 ఏళ్ల రోహన్ బోపన్నకు జతగా శ్రీరామ్ బాలాజీ ఆడనుండగా.. సింగిల్స్‌లో సుమిత్ నగాల్ పారిస్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.
ఒలింపిక్స్‌లో ఈసారి భారత్‌కు పతకం లభించే క్రీడాంశంలో టెన్నిస్ కూడా ఉందనడంలో సందేహం లేదు. పురుషుల డబుల్స్‌లో 44 ఏళ్ల రోహన్ బోపన్నకు జతగా శ్రీరామ్ బాలాజీ ఆడనుండగా.. సింగిల్స్‌లో సుమిత్ నగాల్ పారిస్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. మొత్తంగా ఈ ముగ్గురి ప్రదర్శనపైనే టెన్నిస్ మెడల్ ఆధారపడి ఉంది. డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉన్న రోహన్ బోపన్నకు నేరుగానే ఒలింపిక్ బెర్త్ దక్కింది. అలాగే టాప్-10లో ఉన్న ప్లేయర్స్‌కు తమ భాగస్వామిని ఎంచుకునే అవకాశం ఉం టుంది. దీంతో తను 54వ ర్యాంకర్ యుకీ భాంబ్రిని కాకుండా 67వ ర్యాంకులో ఉన్న బాలాజీని పార్ట్‌నర్‌గా ఎంచుకోవడం ఆశ్చర్యపరిచింది. అయితే క్లే కోర్టులో బాలాజీకి మెరుగైన రికార్డు ఉండడమే దీనికి కారణంగా చెప్పవచ్చు. ఏప్రిల్‌లో ఇటలీలో చాలెంజర్ టోర్నీ డబుల్స్ టైటిల్‌ను, గత నెలలో పెరుగియా చాలెంజర్‌లో రన్నర్‌పగానూ నిలిచాడు. శక్తివంతమైన సర్వీ్‌సలతో పాటు బ్యాక్‌హ్యాండ్ షాట్లతో ప్రత్యర్థికి సవాలు విసరగలడు. అందుకే తనకు సరైన జోడీగా బోపన్న భావించడంతో కెరీర్‌లో తొలిసారి బాలాజీకి ఒలింపిక్స్‌లో ఆడే అవకాశం దక్కబోతోంది. ఏదిఏమైనా ఈసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన జోష్‌లో ఉన్న బోపన్న తన భాగస్వామి సహకారంతో దేశానికి పతకం అందించగలడన్న నమ్మకం అభిమానుల్లో ఏర్పడింది.
నగాల్ వరుసగా రెండోసారి..
సింగిల్స్ విభాగంలో దిగ్గజ ఆటగాడు లియాండర్ పేస్ వరుసగా రెండు ఒలింపిక్స్ (1996, 2000)లో ఆడగా.. ఆ తర్వాత సుమిత్ నగాల్ కూడా అదే ఫీట్‌ను నమోదు చేయబోతున్నాడు. ర్యాంకింగ్స్ కటాఫ్ తేదీ జూన్ 10 వరకు నగాల్ 77వ ర్యాంకులో కొనసాగడంతో అతడికి ఈ సువర్ణావకాశం దక్కింది. టోక్యో గేమ్స్‌లోనూ పాల్గొన్న నగాల్ తొలి రౌండ్‌ను దాటగలిగాడు. అయితే 1996 గేమ్స్‌లో పేస్ కాంస్యంతో చరిత్ర సృష్టించాడు. అలాంటి అద్భుత ప్రదర్శనను నగాల్ నుంచి ఆశించగలమా? అంటే సందేహమే. క్లే కోర్టులో తను మెరుగ్గానే ఆడగలిగినా.. నడాల్, అల్కారజ్, జొకోవిచ్‌లాంటి స్టార్లను దాటుకుని పతకం సాధించడమంటే దాదాపు అసాధ్యంగానే చెప్పవచ్చు.
Updated Date - Jul 23 , 2024 | 06:29 AM