ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అంధుల జట్టు పాక్‌ వెళ్లదు!

ABN, Publish Date - Nov 20 , 2024 | 02:40 AM

పాకిస్థాన్‌కు మరో ఝలక్‌. ఇప్పటికే చాంపియన్స్‌ ట్రోఫీ కోసం టీమిండియా పాక్‌లో పర్యటించేది లేదని తెగేసి చెప్పగా.. తాజాగా అక్కడే జరిగే అంధుల టీ20 వరల్డ్‌క్‌పలోనూ భారత జట్టు పాల్గొనడం లేదు. ఈనెల 23 నుంచి వచ్చే నెల 3 వరకు టోర్నీ....

కేంద్ర అనుమతి నిరాకరణ

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కు మరో ఝలక్‌. ఇప్పటికే చాంపియన్స్‌ ట్రోఫీ కోసం టీమిండియా పాక్‌లో పర్యటించేది లేదని తెగేసి చెప్పగా.. తాజాగా అక్కడే జరిగే అంధుల టీ20 వరల్డ్‌క్‌పలోనూ భారత జట్టు పాల్గొనడం లేదు. ఈనెల 23 నుంచి వచ్చే నెల 3 వరకు టోర్నీ జరగనుంది. అయితే అందులో పాల్గొనేందుకు భారత ప్రభుత్వం నుంచి అంధుల జట్టుకు అనుమతి లభించలేదు. దీంతో టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్టు భారత అంధుల క్రికెట్‌ సంఘం కార్యదర్శి శైలేంద్ర యాదవ్‌ తెలిపాడు. ‘పాక్‌కు వెళ్లేందుకు క్రీడా శాఖ నుంచి మాకు ఎన్‌ఓసీ అందింది. అయితే విదేశాంగ శాఖ అనుమతి కోసం మేం 25 రోజులు వేచిచూసినా స్పందన లేదు. వారికి ఫోన్‌ చేస్తే అనుమతి ఇవ్వడం లేదన్నారు. అధికారికంగా కూడా లేఖ ఇస్తామని చెప్పారు. అందుకే టోర్నీ నుంచి వైదొలుగుతున్నాం. అలాగే ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లు కూడా వివిధ కారణాలతో టోర్నీలో ఆడడం లేదు’ అని శైలేంద్ర పేర్కొన్నాడు.

Updated Date - Nov 20 , 2024 | 02:40 AM