ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వివాదాస్పదమైన ‘బంతి మార్పు’

ABN, Publish Date - Nov 04 , 2024 | 01:43 AM

అనధికార టెస్ట్‌ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా-ఎ జట్టు 7 వికెట్ల తేడాతో భారత్‌-ఎపై గెలిచింది. భారత్‌-ఎ నిర్దేశించిన 225 పరుగుల ఛేదనలో కిందటిరోజు స్కోరు 139/3తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆసీస్‌...

7 వికెట్లతో భారత్‌-ఎ ఓటమి

మెక్‌కే (ఆస్ట్రేలియా): అనధికార టెస్ట్‌ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా-ఎ జట్టు 7 వికెట్ల తేడాతో భారత్‌-ఎపై గెలిచింది. భారత్‌-ఎ నిర్దేశించిన 225 పరుగుల ఛేదనలో కిందటిరోజు స్కోరు 139/3తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆసీస్‌.. వికెట్‌ కూడా చేజార్చుకోకుండా 226 పరుగులు చేసి గెలిచింది. ఓవర్‌నైట్‌ బ్యాటర్లు నాథన్‌ మెక్‌స్వీనీ (88 నాటౌట్‌), వెబ్‌స్టర్‌ (61 నాటౌట్‌) అజేయంగా నిలిచి జట్టును గెలిపించారు. భారత్‌-ఎ 107, 312 స్కోర్లు చేయగా.. ఆసీ్‌స-ఎ తొలి ఇన్నింగ్స్‌లో 195 రన్స్‌ చేసింది. రెండో ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ గురువారం మెల్‌బోర్న్‌లో మొదలవనుంది.


అంపైర్‌తో కిషన్‌ వాగ్వాదం: ఈ మ్యాచ్‌లో బంతిని మార్చడం వివాదాస్పదమైంది. నాలుగో రోజు ఆటకుముందు.. బంతిపై గీతలు పడడంతో మార్చినట్టు అంపైర్‌ స్వాన్‌ క్రెయిగ్‌ చెప్పడంతో భారత ఆటగాళ్లు అతనితో వాగ్వాదానికి దిగారు. ‘మీరే బంతిని గీకారు.. అందుకే మార్చాం. ఎలాంటి వాదోపవాదాలకు తావులేదు. ఆటను మొదలుపెట్టండి’ అని క్రెయిగ్‌ చెప్పడం స్టంప్‌ మైక్‌లో వినిపించింది. దీనిపై భారత జట్టు కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘అయితే, ఈ బంతితో మేం ఆడాలా? ఇదో తెలివితక్కువ నిర్ణయమ’ని ఫైర్‌ అయ్యాడు. దీంతో ‘అమర్యాదకర ప్రవర్తనపై ఫిర్యాదు చేస్తాం. మీరు చేసిన పని కారణంగానే బంతిని మార్చాల్సి వచ్చింద’ని క్రెయిగ్‌ బదులిచ్చాడు. కాగా, బంతి ఆకారం దెబ్బతిన్న కారణంగానే మార్చాల్సి వచ్చిందని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. ఇరుజట్ల కెప్టెన్లు, మేనేజ్‌మెంట్‌కు ముందుగానే సమాచారం ఇచ్చినట్టు పేర్కొంది. కిషన్‌పై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోబోమని తెలిపింది. నిబంధనల ప్రకారం ఉద్దేశపూర్వకంగా బంతి ఆకారాన్ని దెబ్బతీశారని భావిస్తే.. బాల్‌ను మార్చడంతోపాటు బ్యాటింగ్‌ జట్టుకు పెనాల్టీ కింద ఐదు పరుగులు ఇస్తారు. కానీ, భారత్‌పై ఎటువంటి పెనాల్టీ విధించలేదు.

Updated Date - Nov 04 , 2024 | 01:43 AM