T20 World Cup : వచ్చేసింది క్రికెట్ తుఫాన్!
ABN, Publish Date - Jun 02 , 2024 | 07:05 AM
ప్రపంచకప్ టైటిల్‌కు చేరువగా వచ్చి.. అంతలోనే దూరమవుతున్న భారత జట్టు ఈసారి కప్పుతోనే తిరిగి వెళ్లాలనుకొంటుండగా.. మరో ఐసీసీ టైటిల్‌ను సొంతం చేసుకొని అరుదైన రికార్డును దక్కించుకోవాలని ఆస్ట్రేలియా ఉవ్విళ్లూరుతోంది. పాకిస్థాన్, వెస్టిండీ్‌సలు అనిశ్చితికి చెక్ పెట్టాలనుకొంటుండగా.. డిఫెండింగ్ చాంప్ ఇంగ్లండ్, సౌతాఫ్రికా కూడా ఫెవరెట్లలో ఒకటిగా
నేటి నుంచే టీ20 వరల్డ్‌కప్
20 జట్లు..
55 మ్యాచ్‌లు..
29 రోజులు
ఈనెల 29న ఫైనల్
టోర్నీ పూర్తి షెడ్యూల్
ఆదివారం అనుబంధంలో..
నేటి మ్యాచ్‌లు
స్టార్ స్పోర్ట్స్‌లో..
వెస్టిండీస్ X న్యూగిని
వేదిక: గయానా రా. 8 నుంచి
అమెరికా X కెనడా
వేదిక: డాలస్ ఉ. 6 నుంచి
ఎప్పటిలాగే ఫేవరెట్లు.. అంచనాలను తలకిందులు చేసే అండర్ డాగ్‌లు.. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని ఇట్టే మార్చేసే పవర్ హిట్టర్లు.. కీలక సమయంలో తడబడే చోకర్లు.. తమదైన వేళ మేటి జట్లకు షాకులిచ్చే పసికూనలు.. ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ.. అనూహ్య ఫలితాలు.. పట్టరాని భావోద్వేగాల మహా సంగ్రామం టీ20 వరల్డ్‌కప్ వచ్చేసింది. అంతగా ఆదరణలేని అమెరికాలో.. బేస్‌బాల్ గోడలను బద్దలుకొట్టి.. క్రికెట్ జెండాను పాతే 20 జట్ల దండయాత్ర ఆదివారం ఆరంభం కానుంది.
న్యూయార్క్: ప్రపంచకప్ టైటిల్‌కు చేరువగా వచ్చి.. అంతలోనే దూరమవుతున్న భారత జట్టు ఈసారి కప్పుతోనే తిరిగి వెళ్లాలనుకొంటుండగా.. మరో ఐసీసీ టైటిల్‌ను సొంతం చేసుకొని అరుదైన రికార్డును దక్కించుకోవాలని ఆస్ట్రేలియా ఉవ్విళ్లూరుతోంది. పాకిస్థాన్, వెస్టిండీ్‌సలు అనిశ్చితికి చెక్ పెట్టాలనుకొంటుండగా.. డిఫెండింగ్ చాంప్ ఇంగ్లండ్, సౌతాఫ్రికా కూడా ఫెవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగుతున్నాయి. క్లాసెన్, మిల్లర్, డికాక్, రబాడ లాంటి ఆటగాళ్లున్న సఫారీ జట్టు.. ఈసారి ఎలాగైనా తమ ‘చోకర్స్’ ముద్రను తొలగించుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇక, టీ20 ప్రపంచకప్‌లో 20జట్లు తలపడడం ఇదే తొలిసారి కాగా.. అందునా అమెరికాలో ఎంట్రీ ఇస్తుండడం ఈసారి మరింత ప్రత్యేకం. 29 రోజులపాటు సాగే ఈ పొట్టి కప్‌లో మొత్తం 55 మ్యాచ్‌లు జరగనున్నాయి. 16 మ్యాచ్‌లు యూఎ్‌సలో జరగనుండగా.. ఫైనల్ సహా 39 మ్యాచ్‌లు వెస్టిండీ్‌సలో నిర్వహించనున్నారు. మొత్తం 20 జట్లు 4గ్రూపులుగా విడిపోయి తలపడుతున్నాయి. ప్రతి గ్రూపులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. సెమీఫైనల్స్ ఈనెల 26, 27న, ఫైనల్ 29న జరుగుతాయి.
భారత్‌కు పరీక్ష: 2013లో చివరిసారి ఐసీసీ ట్రోఫీ సాధించిన భారత్‌కు ఇది విషమ పరీక్ష. పైగా గత 12 నెలల్లో రోహిత్ కెప్టెన్సీలో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షి్‌ప ఫైనల్, వన్డే వరల్డ్‌కప్ టైటిల్ ఫైట్‌లో టీమిండియా తుది మెట్టుపై చతికిలపడింది. అంతేకాకుండా గత రెండు పొట్టి కప్‌ల్లో కాలం చెల్లిన వ్యూహాలను అమలు చేసి ఘోరంగా విఫలమైంది. మరోసారి అలాంటి తప్పిదాలు తావులేకుండా చూసుకోవాలనుకొంటోంది. ఇటీవలే జరిగిన ఐపీఎల్‌లో బ్యాటర్లు సృష్టించిన విధ్వంసాన్ని స్ఫూర్తిగా తీసుకొని టీమిండియా చెలరేగాల్సి ఉంది. ఇక, స్పిన్నర్లకు సహకరించే కరీబియన్ పిచ్‌లపై ఎలా ఆడాలో మనోళ్లకు అవగతమే.
9న హైవోల్టేజ్
ప్రపంచకప్ అనగానే అందరికీ గుర్తొచ్చేది భారత్, పాక్ పోరు. టోర్నీకే హైలైట్‌గా నిలిచే ఈ హైవోల్టేజ్ ఫైట్ ఈనెల 9న న్యూయార్క్‌లోని నసౌ స్టేడియంలో జరగనుంది.
అందరికీ సవాలే..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఈ ప్రపంచకప్ ఆఖరిదన్న వార్తలు వినిపిస్తుండడంతో.. ఇద్దరికీ ఈ టోర్నీ కీలకం కానుంది. అలాగే, ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్‌కు కూడా ఈ టోర్నీ ఎంతో ముఖ్యం. వన్డే వరల్డ్‌కప్ దారుణ ప్రదర్శనను మరువాలంటే.. ఇంగ్లండ్ ఈ టోర్నీలో అదరగొట్టాలి. అయితే, ఇంగ్లిష్ జట్టుకు భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఆసీస్ కొత్త కెప్టెన్ మిచెల్ మార్ష్‌కు ఈ టోర్నీ అతి పెద్ద పరీక్ష కాగా.. వన్డే ప్రపంచక్‌పనకు అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్ సొంతగడ్డపై సత్తా చాలనుకొంటోంది. అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ ఈసారి ఆందోళన కలిగిస్తోంది. న్యూజిలాండ్ ఎప్పుడూ అండర్‌డాగ్ కాగా.. అప్ఘానిస్థాన్, నమీబియా, నెదర్లాండ్స్ టీమ్‌లు సంచలనం కోసం ఎదురుచూస్తున్నాయి. మొత్తంగా చూస్తే అంచనాలకు అందని టీ20 వరల్డ్‌కప్.. థ్రిల్లింగ్ మ్యాచ్‌లతో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించడం ఖాయం.
Updated Date - Jun 02 , 2024 | 07:05 AM