హాట్ ఫేవరెట్ భారత్
ABN, Publish Date - Sep 16 , 2024 | 05:23 AM
ఆసియా చాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి, ఊపులో ఉన్న భారత హాకీ జట్టు సెమీఫైనల్లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. సోమవారం కొరియాతో డిఫెండింగ్ చాంపియన్...
కొరియాతో సెమీస్ పోరు నేడు
ఆసియా చాంపియన్స్ హాకీ
హులున్‌బుయిర్ (చైనా): ఆసియా చాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి, ఊపులో ఉన్న భారత హాకీ జట్టు సెమీఫైనల్లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. సోమవారం కొరియాతో డిఫెండింగ్ చాంపియన్ భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్ మ్యాచ్‌ల్లో కొరియాతో సహా ఆతిథ్య చైనా, జపాన్, మలేసియా, పాకిస్థాన్‌ను భారత్ ఓడించి, సత్తా చాటింది. ఫార్వర్డ్‌లైన్, మిడ్‌ఫీల్డ్, డిఫెన్స్‌తో సహా అన్ని విభాగాల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోండడంతో భారత్‌పై అంచనాలు పెరిగాయి. యువ స్ట్రయికర్లు సుఖ్‌జీత్ సింగ్, అభిషేక్, ఉత్తమ్ సింగ్, గుర్జోత్ సింగ్ మంచి ఫామ్‌లో ఉండగా మన్‌ప్రీత్ సింగ్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కూడా స్థాయికి తగినట్టుగా ఆడుతుండడం భారత్‌ను బలీయంగా తయారు చేసింది.
ప్రత్యర్థి కొరియా లీగ్ దశలో టీమిండియా చేతిలో ఓడినా నాకౌట్ పోటీల్లో అంచనాలను తలకిందులు చేయగల సత్తా ఆ జట్టుకు ఉండడంతో సెమీస్ పోరు రసవత్తరంగా సాగే అవకాశముంది. కాగా, సోమవారమే జరిగే మరో సెమీఫైనల్లో పాకిస్థాన్‌తో చైనా తలపడనుంది.
Updated Date - Sep 16 , 2024 | 05:23 AM