ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వినేశ్‌ కేసుపై విచారణ పూర్తి

ABN, Publish Date - Aug 10 , 2024 | 06:29 AM

అనర్హతను సవాలు చేస్తూ భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ వేసిన కేసుపై ఇక్కడి క్రీడా మధ్యవర్తిత్వ న్యాయస్థానం (సీఏఎస్‌)లో శుక్రవారం విచారణ జరిగింది. పారిస్‌ ఒలింపిక్స్‌

తీర్పుపై ఐఓఏ ఆశాభావం

పారిస్‌: అనర్హతను సవాలు చేస్తూ భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ వేసిన కేసుపై ఇక్కడి క్రీడా మధ్యవర్తిత్వ న్యాయస్థానం (సీఏఎస్‌)లో శుక్రవారం విచారణ జరిగింది. పారిస్‌ ఒలింపిక్స్‌ మహిళల 50 కిలోల ఫైనల్లో గత బుధవారం అమెరికా రెజ్లర్‌ సారా హిల్డ్‌బ్రాంట్‌తో వినేశ్‌ తలపడాల్సి ఉంది. అయితే నిర్దేశిత బరువుకంటే 100 గ్రాములు అదనంగా ఉండడంతో ఫైనల్‌ ఆడకుండా వినేశ్‌పై వేటు వేసిన విషయం తెలిసిందే. దీనిని సీఏఎస్‌లో ఫొగట్‌ సవాలు చేసింది. సీఏఎస్‌ అడ్‌హాక్‌ డివిజన్‌ ఎదుట జరిగిన శుక్రవారంనాటి విచారణకు వినేశ్‌ వర్చువల్‌గా హాజరైంది. ఆమె తరపున ఫ్రాన్స్‌ న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆపై యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (యూడబ్ల్యూడబ్ల్యూ), అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం (ఐఓసీ) లాయర్లు వాదనలు వినిపించారు. భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) తరపున హాజరైన హరీశ్‌ సాల్వే, విధుష్పత్‌ సింఘానియా గంటపాటు తమ వాదనలు వినిపించారు. కాగా..తీర్పు వినేశ్‌కు అనుకూలంగా వస్తుందన్న ఆశాభావాన్ని భారత ఒలింపిక్‌ సంఘం వ్యక్తంజేసింది.

Updated Date - Aug 10 , 2024 | 06:29 AM

Advertising
Advertising
<