ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నోటిఫికేషన్‌ వచ్చేసింది

ABN, Publish Date - May 15 , 2024 | 01:58 AM

మరో నెలన్నరలో కోచ్‌ ద్రవిడ్‌ పదవి ముగియనుంది. ఈనేపథ్యంలో టీమిండియా ప్రధాన కోచ్‌ పదవికి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. మూడున్నర సంవత్సరాల పదవీకాలం కలిగిన ఈ పోస్టుకు...

టీమిండియా కోచ్‌ పదవికి దరఖాస్తుల ఆహ్వానం

న్యూఢిల్లీ: మరో నెలన్నరలో కోచ్‌ ద్రవిడ్‌ పదవి ముగియనుంది. ఈనేపథ్యంలో టీమిండియా ప్రధాన కోచ్‌ పదవికి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. మూడున్నర సంవత్సరాల పదవీకాలం కలిగిన ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకొనేందుకు ఈనెల 27 తుది గడువు. అప్లికేషన్లను పరిశీలించిన తర్వాత వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించి ఆపై అభ్యర్థిని ఎంపిక చేస్తారు. ఎంపికైనవారు జూలై 1న బాధ్యతలు చేపట్టి 2027 వన్డే వరల్డ్‌ కప్‌ ముగిసే వరకు పదవిలో కొనసాగుతారని బోర్డు తెలిపింది. ఇక దరఖాస్తు చేసుకొనే వారి వయస్సు 60లోపు ఉండాలి. కనీసం 30 టెస్ట్‌లు లేదా 50 వన్డేలు ఆడి ఉండాలి. లేదా టెస్ట్‌లు ఆడుతున్న జట్టుకు కనీసం రెండేళ్లు ప్రధాన కోచ్‌గా వ్యవహరించి ఉండాలి. ఐసీసీ అనుబంధ దేశ/ఐపీఎల్‌/అందుకు సమానమైన ఇంటర్నేషనల్‌ లీగ్‌/ఫ్‌స్టక్లా్‌స/జాతీయ ‘ఎ’ జట్లకు కనీసం మూడు సంవత్సరాలు హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించి ఉండాలి. అనుభవం ఆధారంగా/చర్చల ద్వారా వేతనం ఉంటుందని పేర్కొంది. మూడు ఫార్మాట్లలో భారత జట్టు ప్రదర్శన, నిర్వహణ హెడ్‌ కోచ్‌దేనని స్పష్టంజేసింది. అతడికింద 14 నుంచి 16 మంది సహాయ సిబ్బంది పని చేస్తారని పేర్కొంది.

Updated Date - May 15 , 2024 | 01:58 AM

Advertising
Advertising