ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సింధు, లక్ష్య ముందుకు..

ABN, Publish Date - Nov 21 , 2024 | 05:58 AM

స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, లక్ష్య సేన్‌ చైనా మాస్టర్స్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన ఆరంభ రౌండ్లో ప్రపంచ 19వ ర్యాంకర్‌ సింధు 21-17,

ప్రీక్వార్టర్స్‌కు సాత్విక్‌, గాయత్రి జోడీలు

షెన్‌జెన్‌ (చైనా): స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, లక్ష్య సేన్‌ చైనా మాస్టర్స్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన ఆరంభ రౌండ్లో ప్రపంచ 19వ ర్యాంకర్‌ సింధు 21-17, 21-19తో థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్‌ ఓంగ్బారున్‌ఫాన్‌పై గెలుపొందింది. బుసానన్‌తో 21 మ్యాచుల్లో సింధుకిది 20వ గెలుపు కావడం విశేషం. ఇక మాళవిక బన్సోద్‌ 20-22, 23-21, 21-16తో హోజ్‌మార్క్‌ (డెన్మార్క్‌)కు షాకిచ్చి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. లక్ష్య 21-14, 13-21, 21-13తో పారిస్‌ ఏడో సీడ్‌ లీ జీ జియా (మలేసియా)ను కంగుతినిపించాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ శెట్టి జంట 12-21, 21-19, 21-19తో చైనీస్‌ తైపీ జోడీ లీ జీ/యాంగ్‌ సువాన్‌పై మహిళల డబుల్స్‌లో గాయత్రి/ట్రీసా ద్వయం 21-15, 21-14తో తైవాన్‌ జోడీ హూ లింగ్‌ ఫాంగ్‌/జెంగ్‌ యూపై నెగ్గి ప్రీక్వార్టర్స్‌లో ప్రవేశించాయి.

Updated Date - Nov 21 , 2024 | 05:58 AM