మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నలుగురు స్పిన్నర్లు ఉండాల్సిందే

ABN, Publish Date - May 03 , 2024 | 02:56 AM

భారత టీ20 వరల్డ్‌కప్‌ టీమ్‌లో నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడాన్ని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పూర్తిగా సమర్ధించుకున్నాడు. సెలెక్షన్‌ విషయంలో...

నలుగురు స్పిన్నర్లు ఉండాల్సిందే

ముంబై: భారత టీ20 వరల్డ్‌కప్‌ టీమ్‌లో నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడాన్ని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పూర్తిగా సమర్ధించుకున్నాడు. సెలెక్షన్‌ విషయంలో టీమిండియా మేనేజ్‌మెంట్‌ ఎంతో స్పష్టతతో ఉన్నట్టు చెప్పాడు. జట్టు ఎంపికపై ఎదురవుతున్న విమర్శలకు సమాధానం చెప్పేందుకు గురువారమిక్కడ నిర్వహించిన మీడియా సమావేశంలో రోహిత్‌తోపాటు సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ అజిత్‌ అగార్కర్‌ కూడా పాల్గొన్నాడు. ‘విండీ్‌సలో ఆడేందుకు నలుగురు స్పిన్నర్లు కావాల్సిందే. దానికి తగిన కారణాలు ఉన్నాయి. మాకు వెస్టిండీస్‌ పిచ్‌లపై ఆడిన అనుభవం ఉంది. అక్కడ ఉదయం 10 గంటలకు మ్యాచ్‌ ఆరంభమవుతుంది. గయానా, ఆంటిగ్వా వికెట్లు స్లో బౌలర్లకు సహకరిస్తాయ’ని రోహిత్‌ చెప్పాడు.


అది కఠిన నిర్ణయమే : అగార్కర్‌

ఫామ్‌లోలేకున్నా పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కు జట్టులో చోటు కల్పించడం సరైన నిర్ణయమేనని అగార్కర్‌ చెప్పుకొచ్చాడు. ‘ఫిట్‌నెస్‌ ఉంటే హార్దిక్‌కు ప్ర త్యామ్నాయమే లేదు. ఓ మిడిలార్డర్‌ బ్యాటర్‌ను తీసుకోవడం కోసం టాప్‌లో ఆడుతున్న కేఎల్‌ రాహుల్‌ను పక్కనబెట్టాల్సిన పరిస్థితి. అలాగే రింకూను పక్కనబెట్టడం కఠిన నిర్ణయమే’ అని అగార్కర్‌ అన్నాడు.

Updated Date - May 03 , 2024 | 02:56 AM

Advertising
Advertising