ప్రజ్ఞానందకు మూడో స్థానం
ABN, Publish Date - Jun 09 , 2024 | 04:20 AM
నార్వే చెస్ టోర్నీలో భారత టీనేజ్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద మూడో స్థానంలో నిలిచాడు. ఆఖరిదైన పదో రౌండ్లో అమెరికా గ్రాండ్ మాస్టర్ హికరు నకమురాతో క్లాసికల్ గేమ్‌ను ప్రజ్ఞానంద డ్రాగా...
నార్వే చెస్ విజేత కార్ల్‌సన్
స్టావెంజర్ (నార్వే): నార్వే చెస్ టోర్నీలో భారత టీనేజ్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద మూడో స్థానంలో నిలిచాడు. ఆఖరిదైన పదో రౌండ్లో అమెరికా గ్రాండ్ మాస్టర్ హికరు నకమురాతో క్లాసికల్ గేమ్‌ను ప్రజ్ఞానంద డ్రాగా ముగించాడు. అయితే, ఆర్మ్‌గెడాన్‌లో నకమురాపై ప్రజ్ఞానంద గెలిచాడు. మొత్తం 14.5 పాయింట్లతో ప్రజ్ఞానంద తృతీయ స్థానం దక్కించుకొన్నాడు. వరల్డ్ నెంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ (17.5 పాయింట్లు) విజేతగా నిలవగా.. నకమురా (15.5) రెండో స్థానం సొంతం చేసుకున్నాడు. మహిళల విభాగంలో భారత స్టార్లు వైశాలి (12.5), కోనేరు హంపి (10) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. 19 పాయింట్లతో చైనా గ్రాండ్ మాస్టర్ జు వెన్ టైటిల్‌ను అందుకుంది.
Updated Date - Jun 09 , 2024 | 04:20 AM