ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కోహ్లీ వారసుడిగా థండర్‌ తిలక్‌

ABN, Publish Date - Nov 17 , 2024 | 05:59 AM

టీ20 క్రికెట్‌కు విరాట్‌ రిటైర్మెంట్‌ ప్రకటించాక ఎంతో కీలకమైన వన్‌డౌన్‌ స్థానాన్ని భర్తీ చేసేదెవరన్నది పెద్ద ప్రశ్నగా మిగిలింది. టీ20 వరల్డ్‌క్‌పలో రిషభ్‌ పంత్‌తో ప్రయోగం చేసినా ఆశించినంత ఫలితం దక్కలేదు. గతంలో రుతురాజ్‌ గైక్వాడ్‌, అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌లను

న్యూఢిల్లీ: టీ20 క్రికెట్‌కు విరాట్‌ రిటైర్మెంట్‌ ప్రకటించాక ఎంతో కీలకమైన వన్‌డౌన్‌ స్థానాన్ని భర్తీ చేసేదెవరన్నది పెద్ద ప్రశ్నగా మిగిలింది. టీ20 వరల్డ్‌క్‌పలో రిషభ్‌ పంత్‌తో ప్రయోగం చేసినా ఆశించినంత ఫలితం దక్కలేదు. గతంలో రుతురాజ్‌ గైక్వాడ్‌, అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌లను మూడో నెంబర్‌లో ఆడించే ప్రయత్నం చేశారు. అయితే, తాజాగా దక్షిణాఫ్రికాతో ముగిసిన టీ20 సిరీ్‌సలో ఎడమచేతి వాటం బ్యాటర్‌ తిలక్‌ వర్మ రూపంలో అందుకు తగిన సమాధానం లభించింది. నాలుగో నెంబర్‌లో బ్యాటింగ్‌ చేసే తిలక్‌.. తనకు అందివచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. సెంచూరియన్‌లో జరిగిన మూడో టీ20లో తొలిసారి వన్‌డౌన్‌లో దిగిన 22 ఏళ్ల వర్మ శతకంతో దుమ్మురేపాడు. ఆ తర్వాత జొహాన్నె్‌సబర్గ్‌లో జరిగిన నాలుగో మ్యాచ్‌లో వరుసగా రెండో సెంచరీ సాధించాడు. టీమిండియాలో అసాధారణ షాట్లు ఆడే కొద్ది మందిలో సూర్య, పంత్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్థాయి. ఇప్పుడు తిలక్‌ వారి సరసన సగర్వంగా చేరాడు. స్వీప్‌లు ఎలా ఆడగలడో.. రివర్స్‌ స్వీప్‌లను అదే విధంగా బౌండ్రీ ఆవలకు తరలిస్తున్నాడు. మొత్తంగా డోంట్‌ కేర్‌ ఆటతో ప్రత్యర్థుల్లో దడపుట్టించే పవర్‌ప్యాక్‌ క్రికెటర్‌గా తిలక్‌ మారాడు. ఇక, రానున్న రోజుల్లో విరాట్‌ క్లాస్‌ ఆటను చూసిన స్థానంలో అందుకు భిన్నంగా తిలక్‌ విధ్వంసకర విన్యాసాలు చూస్తాం.

‘ఫ్లయింగ్‌ కిస్‌’ అందుకే: వర్మ

‘వరుసగా రెండో సెంచరీ.. అదీ దక్షిణాఫ్రికా లాంటి పెద్ద జట్టుపై అంటే ఇప్పటికీ నమ్మకం కుదరడం లేదు. వన్‌డౌన్‌లో ఆడే అవకాశం కెప్టెన్‌ ఇచ్చాడు. దాన్ని ఎంతో ఆస్వాదించా. జట్టు అవసరాలమేరకు ఎక్కడ ఆడమన్నా సిద్ధమే. ఇక, ‘ఫ్లయింగ్‌ కిస్‌’ గురించి అంటారా.. అది దేవుడికి నాదైన కృతజ్ఞతలు..!’

Updated Date - Nov 17 , 2024 | 05:59 AM