ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘టాప్‌’ లేపాలి

ABN, Publish Date - Jun 22 , 2024 | 05:05 AM

వరల్డ్‌ కప్‌ సూపర్‌-8 తొలి మ్యాచ్‌ ఆడిన గంటల్లోనే.. భారత్‌, బంగ్లాదేశ్‌ మరో పోరుకు సిద్ధమయ్యాయి.

బంగ్లాదేశ్‌తో భారత్‌ మ్యాచ్‌ నేడు

నార్త్‌సౌండ్‌ (ఆంటీగ్వా): వరల్డ్‌ కప్‌ సూపర్‌-8 తొలి మ్యాచ్‌ ఆడిన గంటల్లోనే.. భారత్‌, బంగ్లాదేశ్‌ మరో పోరుకు సిద్ధమయ్యాయి. శనివారం ఇక్కడ జరిగే మ్యాచ్‌లో రెండు జట్లు తలపడనున్నాయి. మొదటి మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్‌పై సాధించిన విజయంతో టీమిండియా ఉత్సాహంగా ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా చేతిలో పరాజయంతో బంగ్లాదేశ్‌ డీలా పడింది. రెండో మ్యాచ్‌లోనూ నెగ్గి సెమీస్‌ రేసులో మరింత ముందంజ వేయాలని రోహిత్‌ సేన భావిస్తోంది. కాగా..ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే బంగ్లాదేశ్‌ సెమీస్‌ అవకాశాలు సజీవంగా ఉంటాయి. అయితే టాపార్డర్‌ బ్యాటర్లు స్థాయికితగ్గ ప్రదర్శన చేయాలని రెండు జట్లు ఆశిస్తున్నాయి. ముఖ్యంగాఓపెనర్లు రోహిత్‌, విరాట్‌ భారీ ఇన్నింగ్స్‌తో శుభారంభాలు ఇవ్వాల్సి ఉంది. సిక్సర్ల వీరుడు శివమ్‌ దూబే అంచనాలను అందుకోలేకపోతున్నాడు. బంగ్లాదేశ్‌పై కూడా అతడు బ్యాట్‌ ఝళిపించకపోతే రాబోయే మ్యాచ్‌లకు సంజూ శాంసన్‌ పట్ల జట్టు మొగ్గుచూపే అవకాశాలు లేకపోలేదు. బౌలింగ్‌కు సంబంధించి ఈ మ్యాచ్‌కు భారత జట్టులో ఎటువంటి మార్పులూ ఉండకపోవచ్చు.

పిచ్‌, వాతావరణం

స్పిన్నర్లు, సీమర్లకు అనుకూలిస్తుంది. బ్యాటర్లకు పెద్దగా సహకారం లేకపోవడంతో గత మ్యాచ్‌ల్లో ఇక్కడ తక్కువ స్కోర్లు నమోదయ్యాయి. ఆరంభ ఓవర్లలో బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. వర్షం నుంచి ఎటువంటి అంతరాయమూ ఉండబోదు.

బంగ్లా డీలా..

మరోవైపు టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్‌ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. పవర్‌ హిట్టర్లు లేకపోవడం ఆ జట్టు ప్రధాన లోపం. దానికితోడు ఓపెనర్‌ లిట్టన్‌ దాస్‌, తన్‌జీద్‌ రాణించకపోవడంతో బంగ్లా కష్టాలు రెండింతలయ్యాయి. ఈనేపథ్యంలో బుమ్రా పదునైన బౌలింగ్‌ను బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారన్నది వేచి చూడాలి. ముస్తాఫిజుర్‌ సారథ్యంలోని పేస్‌ దళం ఆకట్టుకుంటున్నా..లెగ్గీ రిషద్‌ హొసేన్‌కు ఇతర స్పిన్నర్ల నుంచి సహకారం లభించడంలేదు.

జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, పంత్‌, సూర్యకుమార్‌, దూబే, హార్దిక్‌, అక్షర్‌, బుమ్రా, జడేజా, అర్ష్‌దీప్‌, కుల్దీప్‌ యాదవ్‌.

బంగ్లాదేశ్‌: షంటో (కెప్టెన్‌), తన్‌జీద్‌, లిట్టన్‌ దాస్‌, హ్రిదాయ్‌, షకీబల్‌, మహ్ముదుల్లా, మెహిదీ హసన్‌, రిషాద్‌, టస్కిన్‌, తన్జిద్‌ హసన్‌ సకీబ్‌, ముస్తాఫిజుర్‌.

Updated Date - Jun 22 , 2024 | 05:05 AM

Advertising
Advertising