ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కాసుల సునామీ

ABN, Publish Date - Sep 12 , 2024 | 03:32 AM

గత ఏడాది వన్డే వరల్డ్‌ కప్‌ను భారత్‌ విజయవంతంగా నిర్వహించింది. నిరుడు అక్టోబరు ఐదు నుంచి నవంబరు 19 వరకు దేశంలోని 10 కేంద్రాలలో జరిగిన ఈ మెగా టోర్నీకి రికార్డు స్థాయిలో...

రూ.11,637 కోట్లు

వన్డే వరల్డ్‌ కప్‌తో ఆదాయం

ముంబైతో రోహిత్‌ ప్రయాణం ముగిసినట్టే!

న్యూఢిల్లీ: గత ఏడాది వన్డే వరల్డ్‌ కప్‌ను భారత్‌ విజయవంతంగా నిర్వహించింది. నిరుడు అక్టోబరు ఐదు నుంచి నవంబరు 19 వరకు దేశంలోని 10 కేంద్రాలలో జరిగిన ఈ మెగా టోర్నీకి రికార్డు స్థాయిలో 12.50 లక్షల మంది హాజరయ్యారు. టోర్నీ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు దండిగా ఆదాయం లభించింది. ఏకంగా రూ. 11,637 కోట్లు భారత ఆర్థిక వ్యవస్థకు సమకూరినట్టు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) బుధవారం వెల్లడించింది. ఈమేరకు మెగా టోర్నమెంట్‌కు సంబంధించిన సమగ్ర ఆర్థిక నివేదికను వెలువరించింది. టోర్నమెంట్‌ నిర్వహణకు బీసీసీఐ, ఐసీసీ పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించాయి.


ముఖ్యంగా..మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన వేదికల క్రికెట్‌ సంఘాలు మైదానాలలో ఆధునిక వసతుల కల్పనకు భారీగా ఖర్చు చేశాయి. స్టేడియాల ఆధునికీకరణ వల్ల దేశంలోని ఎన్నో పరిశ్రమలకు నేరుగా లబ్ధి చేకూరింది. ‘ఐసీసీ 2023 పురుషుల వన్డే ప్రపంచ కప్‌ క్రికెట్‌ ఆర్థిక సత్తా ఎలాంటిదో తెలియజేసింది. ఈ టోర్నీ వేలాది ఉద్యోగాలను సృష్టించింది. భారత్‌ను పర్యాటక స్వర్గధామంగా నిరూపించింది. ఐసీసీ ఈవెంట్లు క్రికెట్‌ ఫ్యాన్స్‌ను అలరించడమేకాదు ఆతిథ్య దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఊతంగా నిలుస్తాయని స్పష్టమైంది’ అని ఐసీసీ సీఈవో జెఫ్‌ అలర్డైస్‌ పేర్కొన్నారు. వన్డే వరల్డ్‌ కప్‌వల్ల ప్రధానంగా లాభపడింది పర్యాటక రంగం. ఈ ఒక్క రంగమే ఏకంగా రూ. 7200 కోట్లకుపైగా ఆర్జించింది. వసతి, రవాణా, ఆహార పానీయాల రంగాల ద్వారా రూ. 4,300 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. టోర్నీకి హాజరైన 12.50 లక్షల మందిలో 75 శాతం మంది తొలిసారి వన్డే ప్రపంచ కప్‌నకు తరలి రావడం గమనార్హం. ఇది 50 ఓవర్ల ఫార్మాట్‌కు పెరుగుతున్న ఆదరణగా ఐసీసీ పేర్కొంది. టోర్నమెంట్‌కు వీక్షణకు విచ్చేసిన అంతర్జాతీయ ప్రయాణికుల్లో అధికులు దేశంలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. వీరివల్ల ఆర్థిక వ్యవస్థకు రూ. 2,300 కోట్ల అదనపు ఆదాయం లభించింది. ఇక..టోర్నమెంట్‌ 48 వేల మందికి ఫుల్‌, పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు కల్పించింది.


న్యూఢిల్లీ: ఐపీఎల్‌ మెగా వేలానికి సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో రోహిత్‌ శర్మ భవితవ్యం గురించిన చర్చే ఎక్కువగా జరుగుతోంది. గత సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌ను తప్పించి హార్దిక్‌ పాండ్యాకు జట్టు పగ్గాలప్పగించారు. అప్పటి నుంచి రోహిత్‌ ఫ్రాంచైజీ మారతాడనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో శర్మ జట్టు మారడం దాదాపుగా ఖాయమని భారత మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా ఓ యూట్యూబ్‌ చానెల్‌కు చెప్పాడు. ‘ముంబై మాత్రం అతడిని అట్టిపెట్టుకోదని అనుకొంటున్నా. శర్మ కూడా వీడాలనే అభిప్రాయంతో ఉన్నాడు. అయితే, అతడు వేలానికి రాకుండా.. మరో ఫ్రాంచైజీకి ట్రేడ్‌ చేసే అవకాశం ఉంద’ని చోప్రా తెలిపాడు. ముంబైతో అతడి సుదీర్ఘ ప్రయాణం ముగిసిందనైతే చెప్పగలనన్నాడు. సూర్యకుమార్‌ కూడా ఎంఐను వీడతాడనే ఊహాగానాలు వినవస్తున్నాయి. కానీ, కెరీర్‌లో ఈ దశలో సూర్య ముంబైను వీడతాడని తానైతే భావించడం లేదని చోప్రా చెప్పాడు. ఫ్రాంచైజీ కూడా అలాంటి ఆలోచనతో ఉన్నట్టు తనకు సమాచారం లేదన్నాడు.

Updated Date - Sep 12 , 2024 | 03:32 AM

Advertising
Advertising