ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

T20 Worldcup: వామ్మో.. క్రికెట్‌లో ఇలాంటి ప్రమాదాలు కూడా జరుగుతాయా? క్యాచ్ కోసం వెళ్లి ఎలా గాయపడ్డారో చూడండి..

ABN, Publish Date - Jun 24 , 2024 | 02:49 PM

టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా సెమీస్‌లోకి దూసుకెళ్లింది. వెస్టిండీస్‌తో అంటిగ్వాలో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సెమీస్‌కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్ చివరి వరకు పోరాటం చేసింది. మరోవైపు దక్షిణాఫ్రికా కూడా అంతే స్థాయిలో పోరాడింది.

SA players collided

టీ20 ప్రపంచకప్‌ (T20 Worldcup)లో దక్షిణాఫ్రికా (South Africa) సెమీస్‌లోకి దూసుకెళ్లింది. వెస్టిండీస్‌తో అంటిగ్వాలో జరిగిన మ్యాచ్‌లో (SA vs WI) మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సెమీస్‌కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్ చివరి వరకు పోరాటం చేసింది. మరోవైపు దక్షిణాఫ్రికా కూడా అంతే స్థాయిలో పోరాడింది. ఈ పోరాటంలో దక్షిణాఫ్రికా పై చేయి సాధించింది. విండీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని 16.1 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.


ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ప్రధాన బౌలర్లు కగిసో రబాడా (kagiso rabada), మార్కో జాన్‌సెన్ (Marco Jansen) భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. విండీస్ ఇన్నింగ్స్ 8వ ఓవర్లో బ్యాటర్ భారీ షాట్‌ కొట్టాడు. ఆ బంతిని బౌండరీ లైన్ దగ్గర పట్టుకునేందుకు రబాడా, మార్కో ప్రయత్నించారు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకోకుండా వేగంగా బంతి వద్దకు పరిగెత్తారు. ఆ క్రమంలో ఇద్దరూ చాలా బలంగా ఒకరినొకరు ఢీకొన్నారు. మార్క్ హోర్డింగ్‌కు తగిలి కిందపడిపోగా, రబాడా బౌండరీ లైన్ ఇవతల పడ్డాడు.


ఇద్దరూ వెంటనే పైకి లేవలేకపోయారు. వెంటనే ఫిజయో వచ్చి ఇద్దరినీ పరీక్షించి గాయాలు కాలేదని తేల్చారు. కాగా, అనంతరం ఛేజింగ్ సమయంలో ఈ ఇద్దరే విన్నింగ్ రన్స్ చేయడం విశేషం. అంతేకాదు వీరిద్దరూ చెరో వికెట్ తీసి విండీస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు.

ఇవి కూడా చదవండి..

T20 Worldcup: ఆస్ట్రేలియాపై అఫ్గాన్ గెలుపు.. ఆసక్తికరంగా మారిన సెమీస్ రేస్..!


Virat Kohli: వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. మొట్టమొదటి ఆటగాడిగా అవతరణ


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 24 , 2024 | 02:49 PM

Advertising
Advertising