ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

లఖ్‌నవూకు కష్టమే!

ABN, Publish Date - May 15 , 2024 | 02:09 AM

గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో నిరాశపరిచిన లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ ప్లేఆఫ్స్‌ ఆశలను దాదాపుగా దూరం చేసుకుంది. అటు తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆల్‌రౌండ్‌షోతో మురిపించింది....

చివరి మ్యాచ్‌లో గెలిచిన ఢిల్లీ

చెలరేగిన పోరెల్‌, స్టబ్స్‌

ఈ ఫలితంతో ప్లేఆఫ్స్‌కు రాజస్థాన్‌

న్యూఢిల్లీ: గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో నిరాశపరిచిన లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ ప్లేఆఫ్స్‌ ఆశలను దాదాపుగా దూరం చేసుకుంది. అటు తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆల్‌రౌండ్‌షోతో మురిపించింది. అభిషేక్‌ పోరెల్‌ (33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 58), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (25 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 నాటౌట్‌) మెరుపు అర్ధసెంచరీలతో ఆకట్టుకోగా, మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 19 పరుగులతో లఖ్‌నవూపై గెలిచింది. దీంతో 14 పాయింట్లతో ఐదో స్థానానికి చేరిన ఢిల్లీ సాంకేతికంగా రేసులో ఉన్నా.. నెట్‌రన్‌రేట్‌లో ఇతర జట్లకన్నా వెనుకంజలో ఉంది. అటు లఖ్‌నవూ తమ ఆఖరి మ్యాచ్‌ గెలిచి 14 పాయింట్లు సాధించినా ముందుకెళ్లడం దాదాపు అసాధ్యమే. ఇక ఢిల్లీ గెలుపుతో రాజస్థాన్‌ రాయల్స్‌ (16) ప్లేఆ్‌ఫ్సకు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 208 పరుగులు చేసింది. హోప్‌ (38), కెప్టెన్‌ పంత్‌ (33) ఫర్వాలేదనిపించారు. నవీనుల్‌కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో లఖ్‌నవూ 20 ఓవర్లలో 9 వికెట్లకు 189 రన్స్‌ చేసి ఓడింది. నికోలస్‌ పూరన్‌ (27 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 61), అర్షద్‌ ఖాన్‌ (33 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 58 నాటౌట్‌) వేగంగా ఆడారు. 3 వికెట్లు తీసిన ఇషాంత్‌ శర్మ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు.


పూరన్‌, అర్షద్‌ పోరాటం: ఓ మాదిరి ఛేదనలో లఖ్‌నవూ తొలి ఓవర్‌ నుంచే తడబడింది. పూరన్‌, ఎనిమిదో నెంబర్‌ బ్యాటర్‌ అర్షద్‌ ఖాన్‌ పోరాటం ఆకట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఇషాంత్‌ పదునైన బంతులకు రాహుల్‌ (5), డికాక్‌ (12), హుడా (0) వికెట్లను కోల్పోయింది. ఇక స్టొయిని్‌స (5)ను అక్షర్‌ అవుట్‌ చేశాడు. 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన వేళ పూరన్‌ మాత్రం ఢిల్లీ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. నాలుగో ఓవర్‌లోనే అతను 4,6,4,6తో 20 రన్స్‌ రాబట్టాడు. ఆరో ఓవర్‌లోనూ 6,4 బాదడంతో జట్టు పవర్‌ప్లేలో 59/4తో నిలిచింది. ఆ తర్వాతా ఎడాపెడా బౌండరీలతో పూరన్‌ 20 బంతుల్లోనే ఫిఫ్టీ చేసినా.. మరోఎండ్‌లో అతడికి సహకారం అందలేదు. చివరకు 12వ ఓవర్‌లో నికోల్‌సను ముకేశ్‌ అవుట్‌ చేశాడు. బదోని (6), క్రునాల్‌ (18) నిరాశపర్చగా, అర్షద్‌ గెలుపుపై ఆశలు రేపాడు. 16వ ఓవర్‌లో యుధ్‌వీర్‌ (14) 4,6తో ఆకట్టుకోగా.. తర్వాతి ఓవర్‌లో అర్షద్‌ 6,6,4తో 18 రన్స్‌ అందించాడు. అదే ఓవర్‌లో యుధ్‌ వీర్‌ నిష్క్రమించినా, అర్షద్‌ ఓ సిక్సర్‌తో 25 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. కానీ ఆఖరి ఓవర్‌లో 23 రన్స్‌ అవసరమవగా రసిఖ్‌ 3 పరుగులే ఇచ్చి లఖ్‌నవూకు ఓటమి రుచి చూపించాడు.


ఆరంభంలో అభిషేక్‌.. ఆఖర్లో స్టబ్స్‌: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జోరంతా పవర్‌ప్లే.. డెత్‌ ఓవర్లలోనే సాగింది. ఓపెనర్‌ అభిషేక్‌ పోరెల్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో చెలరేగాడు. ఆ తర్వాత మధ్య ఓవర్లలో స్పిన్నర్లను ఎదుర్కోవడంలో జట్టు తడబాటుకు లోనైంది. కానీ ఆఖర్లో స్టబ్స్‌ ఇన్నింగ్స్‌తో కాస్త పుంజుకున్న ఢిల్లీ ఆశించిన స్కోరు చేయగలిగింది. తొలి ఓవర్‌లోనే ఫ్రేజర్‌ను పేసర్‌ అర్షద్‌ డకౌట్‌ చేసి ఢిల్లీకి గట్టి షాకిచ్చాడు. కానీ పోరెల్‌ మాత్రం అతడి లోటును భర్తీ చేస్తూ చెలరేగాడు. మూడో ఓవర్‌లో 4,4,6,4తో 21 పరుగులు రాబట్టాడు. తర్వాతి ఓవర్‌లోనే హోప్‌ సైతం 4,4,6తో 16 రన్స్‌ అందించడంతో జట్టు కుదురుకుంది. ఇక ఆరో ఓవర్‌లో పోరెల్‌ 6,6,4తో పవర్‌ప్లేలో జట్టు 73/1 పరుగులతో పటిష్టంగానే కనిపించింది. కానీ ఆ తర్వాత స్పిన్నర్లు బిష్ణోయ్‌, క్రునాల్‌ ఢిల్లీని కట్టడి చేశారు. దీంతో దూకుడు మీదున్న పోరెల్‌ సైతం రన్స్‌ చేసేందుకు ఇబ్బందిపడ్డాడు. 21 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసిన పోరెల్‌ ఆ తర్వాత మరో 8 రన్స్‌ చేసేందుకు 12 బంతులు తీసుకున్నాడు. హోప్‌ను బిష్ణోయ్‌ అవుట్‌ చేయడంతో రెండో వికెట్‌కు 92 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. కాసేపటికే పేసర్‌ నవీనుల్‌.. పోరెల్‌ను వెనక్కిపంపాడు. ఈ దశలో కెప్టెన్‌ పంత్‌, స్టబ్స్‌ నాలుగో వికెట్‌కు 47 పరుగులు జత చేశారు. స్టబ్స్‌ డెత్‌ ఓవర్లలో మరింత చెలరేగాడు. 16వ ఓవర్‌లో 6,4,4తో 18 రన్స్‌.. 19వ ఓవర్‌లో 4,6,6తో 21 రన్స్‌ అందించి స్కోరు బోర్డును పరిగెత్తించడంతో పాటు 22 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. అలాగే ఆఖరి ఓవర్‌లో స్టబ్స్‌, అక్షర్‌ (14 నాటౌట్‌) ఇచ్చిన క్యాచ్‌లను బిష్ణోయ్‌ వదిలేయగా డీసీ స్కోరు 200 దాటింది.


స్కోరుబోర్డు

ఢిల్లీ: ఫ్రేజర్‌ (సి) నవీనుల్‌ (బి) అర్షద్‌ 0, అభిషేక్‌ పోరెల్‌ (సి) పూరన్‌ (బి) నవీనుల్‌ 58, హోప్‌ (సి) రాహుల్‌ (బి) బిష్ణోయ్‌ 38, పంత్‌ (సి) హుడా (బి) నవీనుల్‌ 33, స్టబ్స్‌ (నాటౌట్‌) 57, అక్షర్‌ (నాటౌట్‌) 14, ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 208/4; వికెట్ల పతనం: 1-2, 2-94, 3-111, 4-158; బౌలింగ్‌: అర్షద్‌ 3-0-45-1, మొహిసిన్‌ 4-0-29-0, యుధ్‌వీర్‌ 2-0-28-0, నవీనుల్‌ 4-0-51-2, బిష్ణోయ్‌ 4-0-26-1, క్రునాల్‌ 2-0-20-0, దీపక్‌ హుడా 1-0-9-0.

లఖ్‌నవూ: డికాక్‌ (సి) ముకేశ్‌ (బి) ఇషాంత్‌ 12, రాహుల్‌ (సి) ముకేశ్‌ (బి) ఇషాంత్‌ 5, స్టొయినిస్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) అక్షర్‌ 5, దీపక్‌ హుడా (ఎల్బీ) ఇషాంత్‌ 0, పూరన్‌ (సి) అక్షర్‌ (బి) ముకేశ్‌ 61, బదోని (సి) గుల్బదిన్‌ (బి) స్టబ్స్‌ 6, క్రునాల్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) కుల్దీప్‌ 18, అర్షద్‌ (నాటౌట్‌) 58, యుధ్‌వీర్‌ (సి) హోప్‌ (బి) ఖలీల్‌ 14, బిష్ణోయ్‌ (రనౌట్‌) 2, నవీనుల్‌ (నాటౌట్‌) 2, ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 189/9; వికెట్ల పతనం: 1-7, 2-24, 3-24, 4-44, 5-71, 6-101, 7-134, 8-167, 9-183; బౌలింగ్‌: ఇషాంత్‌ 4-0-34-3, ఖలీల్‌ 2-0-22-1, అక్షర్‌ 1-0-20-1, ముకేశ్‌ 4-0-33-1, కుల్దీప్‌ 4-0-33-1, స్టబ్స్‌ 1-0-4-1, గుల్బదిన్‌ 1-0-12-0, రసిఖ్‌ 3-0-30-0.


పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

కోల్‌కతా 13 9 3 1 19 1.428

రాజస్థాన్‌ 12 8 4 0 16 0.349

చెన్నై 13 7 6 0 14 0.528

హైదరాబాద్‌ 12 7 5 0 14 0.406

ఢిల్లీ 14 7 7 0 14 -0.377

బెంగళూరు 13 6 7 0 12 0.387

లఖ్‌నవూ 13 6 7 0 12 -0.787

గుజరాత్‌ 13 5 7 1 11 -1.063

ముంబై 13 4 9 0 8 -0.271

పంజాబ్‌ 12 4 8 0 8 -0.423

Updated Date - May 15 , 2024 | 02:09 AM

Advertising
Advertising