ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అప్పటిదాకా.. బజ్‌రంగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత

ABN, Publish Date - Jun 04 , 2024 | 04:58 AM

భారత స్టార్‌ రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పూనియాపై జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) విధించిన సస్పెన్షన్‌ను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్టు నాడా క్రమశిక్షణ కమిటీ (ఏడీడీపీ) సోమవారం..

న్యూఢిల్లీ: భారత స్టార్‌ రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పూనియాపై జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) విధించిన సస్పెన్షన్‌ను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్టు నాడా క్రమశిక్షణ కమిటీ (ఏడీడీపీ) సోమవారం ప్రకటించింది. మార్చిలో జరిగిన సెలెక్షన్‌ ట్రయల్స్‌ సందర్భంగా డోప్‌ పరీక్షకు తన శాంపిల్‌ ఇవ్వకుండా వెళ్లడంతో బజ్‌రంగ్‌పై నాడా సస్పెన్షన్‌ విధించిన సంగతి తెలిసిందే. అయితే, పరీక్షల కోసం నాడా అధికారులు గడువు దాటిన కిట్‌లను వాడడంతో తాను యూరిన్‌ శాంపిల్‌ ఇచ్చేందుకు నిరాకరించానంటూ ఏడీడీపీ ముందు హాజరై బజ్‌రంగ్‌ వివరణ ఇచ్చుకున్నాడు. అంతేకాదు.. గడువు ముగిసిన కిట్‌లను ఎందుకు వాడుతున్నారన్న తన ప్రశ్నకు నాడా ఇప్పటికీ బదులివ్వలేదని, ఈ విషయంలో న్యాయ పోరాటం చేస్తున్నానని రెజ్లర్‌ కమిటీకి వివరించాడు. దీంతో నాడా తదుపరి నోటీసులు ఇచ్చేదాకా బజ్‌రంగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేస్తున్నట్టు ఏడీడీపీ తెలిపింది.

Updated Date - Jun 04 , 2024 | 04:58 AM

Advertising
Advertising