ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vamika Birthday: వామిక గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసిన విరుష్క దంపతులు..

ABN, Publish Date - Jan 11 , 2024 | 04:18 PM

ముంబై, జనవరి 11: ఇండియా క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్, క్రికెటర్ విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతుల దంపతుల గారాలపట్టి వామిక పుట్టిన రోజు నేడు. ఇవాళ్టితో వామిక 4వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ మూడు సంవత్సరాలలో సోషల్ మీడియాలో,

Vamika Birthday

ముంబై, జనవరి 11: ఇండియా క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్, క్రికెటర్ విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతుల దంపతుల గారాలపట్టి వామిక పుట్టిన రోజు నేడు. ఇవాళ్టితో వామిక 4వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ మూడు సంవత్సరాలలో సోషల్ మీడియాలో, మెయిన్‌స్ట్రీమ్ మీడియా వేదికగా తమ కూతురు గురించి ఇంట్రస్టింగ్ విషయాలు పంచుకున్నారు విరుష్క దంపతులు. వామిక పుట్టిన రోజున సందర్భంగా విరుష్క దంపతులు చెప్పిన ఆ ఇంట్రస్టింగ్ విషయాలేంటో ఓసారి తెలుసుకుందాం..

తన ఆనందానికి కారణం వామిక..

2022లో ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుష్క శర్మ తన కూతురు వామికకు సంబంధించి ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. తన నవ్వు, సంతోషానికి కారణం వామికగా పేర్కొంది. 'నా కూతురు వామిక నన్ను నవ్వించడానికి ప్రయత్నిస్తుంటుంది. నేను నవ్వడం చూసి.. తను మళ్లీ మళ్లీ నవ్వించడానికి ప్రయత్నిస్తుంది. తన చర్యలతో మాలో సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. చాలా చిన్న పిల్ల అయినా.. మమ్మల్ని నవ్వించడానికి వామిక చాలా కష్టపడుతుంది. తను చేసే అల్లరి నిజంగా నన్ను అలరిస్తుంది.' అని పేర్కొంది అనుష్క శర్మ.

అదే తనలోని ప్రత్యేక లక్షణం..

'గ్రాజియా ఇండియా'తో మాట్లాడుతూ.. వామిక అభివృద్ధి చెందుతున్న వ్యక్తిత్వం, మనస్తత్వం గురించి కీలక వివరాలు పేర్కొంది. 'నాలాగే వామికలోనూ ఒక లక్షణం ఉంది. తను ఏదైనా చేయాలనుకుంటే.. ఆ పని చేసేస్తుంది. ఈ లక్షణం వామికకు భవిష్యత్‌లో మేలు చేస్తుందని భావిస్తున్నాను. నా పాత్ర ఆమెకు మార్గనిర్దేశం చేయడం, సపోర్ట్ చేయడం, మైక్రోమేనేజింగ్ చేయడమే. వామికను మరీ కంట్రోల్ చేయకుండా.. ఆమెకు సలహాలు, సూచనలు ఇచ్చే సౌండింగ్ బోర్డ్‌గా ఉండటమే నా కర్తవ్యం. పిల్లలు అందరితోనూ ప్రేమగా, దయతో ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం' అని చెప్పుకొచ్చారు అనుష్క శర్మ.

ఆదివారం వచ్చిందంటే పండగే..

2023లో, లివ్‌స్పేస్ అన్‌ఫిల్టర్‌తో ఇంటర్వ్యూ సందర్భంగా.. విరాట్ కోహ్లి, అనుష్క దంపతులు దినచర్య గురించి కీలక వివరాలు చెప్పారు. ముఖ్యంగా ఆదివారం వచ్చిందంటే చాలు వారికి పండుగ రోజేనట. 'ఆదివారం చాలా కూల్‌గా, హాయిగా గడిచిపోతుంది. ఆదివారం మాత్రమే కాదు.. ఏదైనా సెలవు రోజు దొరికితే చాలు.. ఇంట్లో ఫుల్ సందడి ఉంటుంది. ఓ కప్పు కాఫీ తాగుతాం. వామికతో రోజంతా ఆడుకుంటాం. కలర్స్ వేస్తాం, ఇళ్లంతా రచ్చ రచ్చ చేస్తాం.' అని చెప్పుకొచ్చారు విరుష్క దంపతులు.

నా కూతురికి నా అవసరం చాలా ఎక్కువ..

2023లో బెంగళూరులో ప్యూమా కోసం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. తమ ఇద్దరిలో వామికాకు తన తల్లే ఎక్కువ అవసరం అని విరాట్ గ్రహించినట్లు అనుష్క చెప్పుకొచ్చింది. 'నా కుమార్తె చిన్న అమ్మాయి. ఆమెకు నా సమయం చాలా ఎక్కువ అవసరం. విరాట్ గొప్ప తండ్రి. అతను ఒక తండ్రిగా తన బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నాడు. విమాకి వయస్సుకు నా అవసరం ఎక్కువగా ఉంటుంది. అందుకే నేను వామికతోనే ఉంటాను.' అని చెప్పుకొచ్చింది. ఈ కారణంగానే ప్రతి సంవత్సరం ఒక సినిమా కంటే ఎక్కువ చేయకూడదని నిర్ణయించుకున్నాను అని అనుష్క చెప్పింది.

వామిక ఫోటోలు ఎందుకు షేర్ చేయరు..

వామిక ఫోటోలు, వీడియోలను ఇప్పటికీ విడుదల చేయలేదు విరుష్క దంపతులు. ఇదే విషయమైన సోషల్ మీడియాలో అభిమానులు చాలా సార్లు ప్రశ్నించారు. దీంతో రియాక్ట్ అయిన విరుష్క దంపతులు.. 'అసలు సోషల్ మీడియా అంటే ఏంటో తమ కూతురికి తెలిసినప్పుడు, తన సొంత నిర్ణయం తీసుకునే వరకు సోషల్ మీడియాలో వామిక ఫోటోలు, వీడియోలు విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నాం' అని చెప్పారు.

కాగా, 2017లో ఇటలీలో టీమిండియా స్టార్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మకు వివాహం జరిగిన విషయం తెలిసిందే. వీరికి 2021, జనవరి 11న వామిక జన్మించింది. నేటితో వామిక 4వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. దీంతో విరుష్క దంపతుల అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - Jan 11 , 2024 | 04:18 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising