ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Virat Kohli: కోహ్లీ తల్లి అనారోగ్యం... క్లారిటీ ఇచ్చిన విరాట్ సోదరుడు

ABN, Publish Date - Jan 31 , 2024 | 03:32 PM

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల మొదటి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ రెండు మ్యాచ్‌లకు విరాట్ దూరంగా ఉండడానికి గల కారణాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల మొదటి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ రెండు మ్యాచ్‌లకు విరాట్ దూరంగా ఉండడానికి గల కారణాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ వైపు అతని భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రెగ్నెన్సీ కారణంగా అతను గైర్హాజరీ అవుతున్నారని కొంతమంది అభిమానులు చెబుతున్నారు. మరోవైపు కోహ్లీ తల్లి అనారోగ్యం కారణంగా మ్యాచులకు దూరమవుతున్నట్లు మరికొంత మంది అంటున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: Virat Kohli: టీమిండియాకు బిగ్ షాక్? మిగతా టెస్టులకూ కోహ్లీ డౌటే!


అయితే ఈ ఊహాగానాలన్నింటినీ విరాట్ కోహ్లీ కుటుంబం పూర్తిగా తోసిపుచ్చింది. విరాట్ తల్లి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో వేదికగా వెల్లడించారు. అంతేకాదు ఇలాంటి విషయాలను ప్రచారం చేయోద్దని అభిమానులను అభ్యర్థించాడు. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం విరాట్ కోహ్లీ తల్లి సరోజ్ కోహ్లీకి లివర్ సమస్య వచ్చిందని, దీంతో ఆమె 2023లో కొంత కాలం పాటు ఆసుపత్రిలో చేరిందని వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో జరిగే మూడో టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేయనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నంలో టీమిండియా రెండో టెస్టు మ్యాచ్ ఆడనుంది.

Updated Date - Jan 31 , 2024 | 03:44 PM

Advertising
Advertising