T20 Worldcup: వారెవ్యా.. అర్ష్‌దీప్ వేసిన బంతి చూస్తే షాకవ్వాల్సిందే.. లిటన్ దాస్‌ను ఎలా అవుట్ చేశాడో చూడండి..
ABN, Publish Date - Jun 02 , 2024 | 05:24 PM
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన టీ-20 ప్రపంచకప్ సమరం ప్రారంభమైంది. అమెరికా-వెస్టిండీస్ వేదికగా ఈ టోర్నీ జరుగుతోంది. ఈ మెగా టోర్నీకి ముందు సన్నాహకంగా జరిగిన మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే.
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన టీ-20 ప్రపంచకప్ (T20 Worldcup) సమరం ప్రారంభమైంది. అమెరికా-వెస్టిండీస్ వేదికగా ఈ టోర్నీ జరుగుతోంది. ఈ మెగా టోర్నీకి ముందు సన్నాహకంగా జరిగిన మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే (India vs Bangladesh). న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది.
రిషబ్ పంత్ (53), హార్దిక్ పాండ్యా (40 నాటౌట్) రాణించారు. అనంతరం ఛేజింగ్‌కు దిగిన బంగ్లా బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీమిండియా బౌలర్లు అమోఘమైన ప్రదర్శన చేసి బంగ్లాదేశ్‌ను కట్టడి చేశారు. ముఖ్యంగా అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) అద్భుతమైన స్వింగ్ బౌలింగ్‌తో చెలరేగాడు. 3 ఓవర్లు వేసి కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి లిటన్ దాస్ (Litton Das)ను అవుట్ చేశాడు.
లిటన్ దాస్‌ను అర్ష్‌దీప్ అవుట్ చేసిన తీరు మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. బంగ్లా ఇన్నింగ్స్ 3వ ఓవర్లో లిటన్ దాస్ ఆడుతుండగా అర్ష్‌దీప్ వేసిన ఓ బ్యాకప్ లెంగ్త్ డెలివరీని లిటన్ దాస్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే ఆఫ్ వికెట్ అవతల పడిన ఆ బంతి అనూహ్యంగా స్వింగ్ అయి వికెట్లను పడగొట్టింది. ఆ అద్బుతమైన ఇన్ స్వింగ్ చూసి లిటన్ దాస్ షాకయ్యాడు. ఈ బంతికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి..
T20 World Cup 2024: నేడే టీ20 ప్రపంచ కప్ 2024 ప్రారంభం.. కానీ ఇండియాలో మాత్రం
Rinku Singh: ఆ కారణం వల్లే చోటు దక్కలేదు.. రింకూ సింగ్ షాకింగ్ కామెంట్స్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 02 , 2024 | 05:24 PM