Sheetal Devi: అబ్బురపరిచిన పారా ఆర్చర్ శీతల్ దేవి.. కాలితోనే విల్లు ఎత్తి సూపర్ షాట్..
ABN, Publish Date - Sep 02 , 2024 | 01:06 PM
పారిస్ పారా ఒలింపిక్స్‌లో 17 ఏళ్ల ఆర్చర్ శీతల్ దేవి తన అద్భుత ప్రతిభతో అందర్నీ ఆశ్చర్యపరిచింది. త్రుటిలో పతకాన్ని చేజార్చుకున్నప్పటికీ ఆమె కొట్టిన ఓ షాట్ దిగ్గజాలను సైతం అబ్బురపరిచింది. క్రీడా ప్రపంచాన్ని ఆకర్షించింది.
పారిస్ పారా ఒలింపిక్స్‌లో (Paris Paralympics) 17 ఏళ్ల ఆర్చర్ శీతల్ దేవి (Sheetal Devi ) తన అద్భుత ప్రతిభతో అందర్నీ ఆశ్చర్యపరిచింది. త్రుటిలో పతకాన్ని చేజార్చుకున్నప్పటికీ ఆమె కొట్టిన ఓ షాట్ దిగ్గజాలను సైతం అబ్బురపరిచింది. క్రీడా ప్రపంచాన్ని ఆకర్షించింది. ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో (para-archer) పోటీ పడిన శీతల్ కాలితో విల్లు ఎక్కి పెట్టి తొలి షాట్‌లో పది పాయింట్లను కొట్టింది. దీంతో అందరూ అవాక్కయ్యారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
శీతల్ కాలితో బాణం వేయగా, ఆమె ప్రత్యర్థి వీల్ చైర్‌లో కూర్చుని చేతులతోనే బాణం వేసి పతకం దక్కించుకుంది. కాగా, కాలితో విల్లు ఎక్కుపెట్టి శీతల్ కొట్టిన షాట్‌కు బార్సిలోనా ఫుట్‌బాల్ స్టార్ జౌలెస్ కుందె, టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఫిదా అయ్యారు. శీతల్ ప్రదర్శన అత్యద్భుతం అని కొనియాడారు. కాగా, ఆర్మ్‌లెస్ ఆర్చర్ (కాలితో విల్లు ఎక్కుపెట్టే క్రీడాకారిణులు)లు ప్రపంచంలో కొద్ది మంది మాత్రమే ఉన్నారు. వారిలో తక్కువ వయసు ఆర్చర్‌గా శీతల్ గుర్తింపు తెచ్చుకుంది. ఇంతటి ప్రతిభ కలిగిన శీతల్ మున్ముందు మరిన్ని ఆద్భుతాలు సాధిస్తుందని చాలా మంది ఆకాంక్ష వ్యక్తం చేశారు.
శీతల్ కొట్టిన షాట్‌కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై ప్రముఖులు, నెటిజన్లు ప్రశంసల కురిపిస్తున్నారు. కేంద్ర రక్షణ శాఖ మాజీ కార్యదర్శి శేఖర్ దత్ ఆ వీడియోను షేర్ చేసి.. ``కోట్లాది మందికి నువ్వు స్ఫూర్తి ప్రదాతవు. మున్ముందు మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా`` అంటూ కామెంట్ చేశారు. ``చేతులు లేకుండా జన్మించిన శీతల్ ఈ స్థాయికి చేరుకోవడం ఎంతో గొప్ప విషయం. నమ్మశక్యం కాని ఫీట్ సాధించినందుకు ధనవ్యాదాలు`` అంటూ ప్రముఖ గ్రీన్ పొలిటీషియన్ ఎరిక్ సోల్హెమ్ కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Champions Trophy: టీమిండియాను పాకిస్తాన్‌కు పంపకూడదు.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
Team India: భారత్-బంగ్లా టెస్ట్ మ్యాచుకు ముగ్గురు కీలక ఆటగాళ్లు దూరం?
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Sep 02 , 2024 | 01:06 PM