ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మేం ఆడియో రికార్డు చేయలేదు

ABN, Publish Date - May 21 , 2024 | 01:00 AM

క్రికెటర్ల వ్యక్తిగత గోప్యతకు ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టర్‌ భంగం కలిగిస్తుందంటూ టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చేసిన ఆరోపణలపై స్టార్‌ గ్రూప్‌ స్పందించింది...

రోహిత్‌ ఆరోపణలను ఖండించిన స్టార్‌ గ్రూప్‌

న్యూఢిల్లీ: క్రికెటర్ల వ్యక్తిగత గోప్యతకు ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టర్‌ భంగం కలిగిస్తుందంటూ టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చేసిన ఆరోపణలపై స్టార్‌ గ్రూప్‌ స్పందించింది. అసలు రోహిత్‌ వ్యక్తిగత సంభాషణకు చెందిన ఎలాంటి ఆడియో రికార్డును తాము ప్రసారం చేయలేదని స్పష్టం చేసింది. ‘రోహిత్‌కు సంబంధించిన ఓ వీడియో క్లిప్‌తో పాటు అతడి పోస్ట్‌ కూడా ఇటీవల అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ వీడియోను వాంఖడే స్టేడియంలో ఈనెల 16న రికార్డు చేశాం. సైడ్‌లైన్‌లో భాగంగా అభిషేక్‌ నాయర్‌తో మాట్లాడిన దాన్ని కూడా కొన్ని సెకన్లపాటు అలా చూపాం. కానీ ఆడియోను రికార్డు చేయడం లేదా ప్రసారం చేయలేదు. ఆటగాళ్ల గోప్యతకు స్టార్‌ గ్రూప్‌ అమిత ప్రాధాన్యమిస్తుంది’ అని స్టార్‌ తేల్చింది. అభిషేక్‌తో ముంబై కెప్టెన్సీ వ్యవహారంపై రోహిత్‌ సంభాషణను అదే రోజు కోల్‌కతా ఫ్రాంచైజీ ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేసి... కొంతసేపటి తర్వాత డిలీట్‌ చేసింది. కానీ అప్పటికే ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

Updated Date - May 21 , 2024 | 01:00 AM

Advertising
Advertising