ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఫైనల్‌ బెర్త్‌ ఎవరిదో?

ABN, Publish Date - Jul 09 , 2024 | 03:50 AM

యూరోపియన్‌ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షి్‌ప్సలో వరుస విజయాలతో జోరు మీదున్న స్పెయిన్‌.. రికార్డుస్థాయిలో నాలుగోసారి ఫైనల్‌ చేరాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో...

స్పెయిన్‌గీఫ్రాన్స్‌

‘యూరో’ సెమీస్‌ నేడు

రా. 12.30 నుంచి సోనీలో..

మ్యూనిచ్‌: యూరోపియన్‌ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షి్‌ప్సలో వరుస విజయాలతో జోరు మీదున్న స్పెయిన్‌.. రికార్డుస్థాయిలో నాలుగోసారి ఫైనల్‌ చేరాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి జరిగే తొలి సెమీస్‌లో మరో బలమైన జట్టు ఫ్రాన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటి వరకు టోర్నీలో ఇరుజట్ల ప్రదర్శన భిన్నంగా సాగింది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ స్పెయిన్‌ విజేతగా నిలిచింది. క్వార్టర్స్‌లో పటిష్ట జర్మనీని ఓడించి సత్తా చాటింది. స్ట్రయికర్లు అల్వరో విలియమ్స్‌, ఓమ్లో, లామిన్‌ యమల్‌, అల్వరో మొరాటా ఫామ్‌లో ఉన్నారు. మరోవైపు టోర్నీలో ఫ్రాన్స్‌ ఇప్పటి వరకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఆ టీమ్‌ ఆటగాడు ఎవరూ నేరుగా ఒక్క గోల్‌ కూడా చేయలేదు.


ఏవైనా గోల్స్‌ నమోదయ్యాయంటే అవి సెల్ఫ్‌ గోల్స్‌ లేదా పెనాల్టీ షూటౌట్‌ల ద్వారా వచ్చినవే. గాయపడిన స్టార్‌ ప్లేయర్‌ ఎంబప్పే దూకుడుగా ఆడలేకపోవడం కూడా మైన్‌సగా మారింది. క్వార్టర్స్‌లో పోర్చుగల్‌పై షూటౌట్‌లో నెగ్గింది. పైగా ఇటీవలి కాలంలో స్పెయిన్‌ చేతిలో ఫ్రాన్స్‌ కంగుతిన్న సందర్భాలే ఎక్కువ.

Updated Date - Jul 09 , 2024 | 03:50 AM

Advertising
Advertising
<