ఎవరో కొత్త చాంప్!
ABN, Publish Date - Oct 20 , 2024 | 01:24 AM
ఎంతో కాలంగా ఊరిస్తున్న ప్రతిష్ఠాత్మక ఐసీసీ ట్రోఫీని దక్కించుకొనే సువర్ణావకాశం న్యూజిలాండ్ ముంగిట నిలిచింది. సోఫీ డివైన్ సారథ్యంలోని కివీస్ మహిళలు ఆదివారం జరిగే టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో...
న్యూజిలాండ్‌తో సౌతాఫ్రికా ఫైనల్ నేడు
మహిళల టీ20 వరల్డ్ కప్
దుబాయ్: ఎంతో కాలంగా ఊరిస్తున్న ప్రతిష్ఠాత్మక ఐసీసీ ట్రోఫీని దక్కించుకొనే సువర్ణావకాశం న్యూజిలాండ్ ముంగిట నిలిచింది. సోఫీ డివైన్ సారథ్యంలోని కివీస్ మహిళలు ఆదివారం జరిగే టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఢీకొననున్నారు. టోర్నీకి ముందు టీ20లలో కివీస్ వరుసగా 10 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. దాంతో ఈసారి మెగా టోర్నీలో ఆ జట్టుపై పెద్దగా అంచనాలు లేవు. కానీ సుజీ బేట్స్, అమీలియా కెర్, లియా తహుహులాంటి స్టార్లతో కూడిన ఆ జట్టు టోర్నీలో అద్భుతాలు సృష్టించి తుదిపోరుకు చేరింది. అయితే తొలి టైటిల్‌పై కన్నేసిన సౌతాఫ్రికా మహిళలను అడ్డుకోవడం ఆషామాషీ కాదు. ఆస్ట్రేలియాను సెమీ్‌సలో చిత్తు చేయడం సఫారీల సత్తాను తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఎవరవుతారో కొత్త చాంపియన్ చూడాలి.
Updated Date - Oct 20 , 2024 | 01:24 AM