T20 World Cup: ప్రపంచకప్‌లో రింకూ సింగ్‌కు అందుకే చోటు కల్పించలేదేమో: సునీల్ గవాస్కర్
ABN, Publish Date - May 01 , 2024 | 10:00 AM
మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న టీ-20 వరల్డ్ కప్‌లో పాల్గొనబోయే భారత జట్టును తాజాగా బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ నాయకత్వంలో 15 మందితో కూడిన జట్టును మంగళవారం ప్రకటించింది. పెద్దగా సంచలనాలు లేకుండానే ఉన్నంతలో మంచి జట్టునే బీసీసీఐ ప్రకటించిందనే భావనలు వ్యక్తమవుతున్నాయి.
మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న టీ-20 వరల్డ్ కప్ (T20 World Cup)లో పాల్గొనబోయే భారత జట్టును తాజాగా బీసీసీఐ (BCCI) ప్రకటించింది. రోహిత్ శర్మ (Rohit Sharma) నాయకత్వంలో 15 మందితో కూడిన జట్టును మంగళవారం ప్రకటించింది. పెద్దగా సంచలనాలు లేకుండానే ఉన్నంతలో మంచి జట్టునే బీసీసీఐ ప్రకటించిందనే భావనలు వ్యక్తమవుతున్నాయి. అయితే విధ్వంసకర ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రింకూ సింగ్‌ను (Rinku Sing) పక్కన పెట్టడం చాలా మందికి విస్మయం కలిగించింది.
లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగి మ్యాచ్‌లను ఫినిష్ చేయగలిగే సత్తా ఉన్న రింకూ.. కరేబియన్ దీవుల్లో కీలక పాత్ర పోషించగలడని మాజీలు కామెంట్లు చేస్తున్నారు. అయితే రింకూ ప్రపంచకప్ జట్టులో లేకపోవడానికి గల కారణాలను దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వివరించాడు. ``ప్రస్తుత ఐపీఎల్‌లో రింకూ అంత గొప్పగా ఆడలేదు. నిజానికి అతడికి అన్ని అవకాశాలు కూడా రాలేదు. కానీ, సెలక్టర్లు ఐపీఎల్ ప్రదర్శననే పరిగణనలోకి తీసుకున్నారనుకుంటున్నా`` అని గవాస్కర్ పేర్కొన్నాడు.
ఈ ఐపీఎల్ (IPL 2024)లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన రింకూ సింగ్.. 150 స్ట్రైక్‌రేట్‌తో 123 పరుగులే చేశాడు. మరోవైపు చెలరేగి ఆడుతున్న శివమ్ దూబే (Shivam Dube) కూడా రింకూ సింగ్ ఎంపికను క్లిష్టతరం చేశాడు. ఈ క్రమంలోనే రింకూ సింగ్ కంటే బౌలింగ్ చేసే సామర్థ్యం కూడా కలిగిన శివమ్ దూబే వైపే సెలెక్టర్లు మొగ్గు చూపినట్టు అర్థమవుతోంది.
భారత టీ20 ప్రపంచకప్ జట్టు (India T20 World Cup Squad):
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, రిషభ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్.
ఇవి కూడా చదవండి..
ICC T20 World Cup India's Team: టీ20 వరల్డ్ కప్ ఇండియా టీమ్ ఇదే..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 01 , 2024 | 10:54 AM