జోర్డాన్‌లో చిక్కుకుపోయిన మహిళా రెజ్లర్లు
ABN, Publish Date - Aug 25 , 2024 | 05:49 AM
వరల్డ్ రెజ్లింగ్ అండర్-17 చాంపియన్‌షిప్ కోసం జోర్డాన్ రాజధాని అమ్మాన్ వెళ్లిన భారత యువ మహిళల జట్టు అక్కడే చిక్కుకుపోయింది. శుక్రవారం పోటీలు ముగియడంతో తొమ్మిది మంది మహిళా రెజ్లర్లు, ముగ్గురు కోచ్‌లు....
న్యూఢిల్లీ: వరల్డ్ రెజ్లింగ్ అండర్-17 చాంపియన్‌షిప్ కోసం జోర్డాన్ రాజధాని అమ్మాన్ వెళ్లిన భారత యువ మహిళల జట్టు అక్కడే చిక్కుకుపోయింది. శుక్రవారం పోటీలు ముగియడంతో తొమ్మిది మంది మహిళా రెజ్లర్లు, ముగ్గురు కోచ్‌లు శనివారం స్వదేశానికి తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో రెజ్లర్లకు కతార్ ఎయిర్‌వేస్, కోచ్‌లకు ఎమిరేట్స్ ఫ్లైట్స్ బుక్ చేశారు. అయితే, కోచ్‌ల ఫ్లైట్ నిర్ణీత సమయానికి బయలుదేరగా, తమ ఫ్లైట్ మాత్రం నిర్ణీత సమయానికంటే ముందే బయలుదేరడంతో రెజ్లర్లు అమ్మాన్ విమానాశ్రయంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. కాగా.. యువ రెజ్లర్లకు, కోచ్‌లకు వేర్వేరు విమానాల్లో టిక్కెట్లు బుక్ చేయడమేంటంటూ భారత రెజ్లింగ్ అధికారులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Updated Date - Aug 25 , 2024 | 05:49 AM