నేపాల్‌కు ‘తొలి’ విజయం
ABN, Publish Date - Jul 20 , 2024 | 05:22 AM
మహిళల టీ20 ఆసియాకప్ చరిత్రలో నేపాల్ జట్టు తొలి విజయాన్ని అందుకుంది. శుక్రవారం యూఏఈతో జరిగిన గ్రూప్ ‘ఎ’ ఆరంభ మ్యాచ్‌లో ఈ జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడంతో ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. 2012, 2016 టోర్నీల్లోనూ పాల్గొన్నప్పటికీ వీరికి
యూఏఈతో మ్యాచ్
దంబుల్లా: మహిళల టీ20 ఆసియాకప్ చరిత్రలో నేపాల్ జట్టు తొలి విజయాన్ని అందుకుంది. శుక్రవారం యూఏఈతో జరిగిన గ్రూప్ ‘ఎ’ ఆరంభ మ్యాచ్‌లో ఈ జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడంతో ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. 2012, 2016 టోర్నీల్లోనూ పాల్గొన్నప్పటికీ వీరికి ఒక్క గెలుపు కూడా దక్కలేదు. ఓపెనర్ సంఝానా ఖడ్కా (72 నాటౌట్) అజేయ అర్ధసెంచరీతో కీలకంగా నిలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 20 ఓవర్లలో 8 వికెట్లకు 115 పరుగులు చేసింది. ఖుషీ శర్మ (36), కవిష (22) మాత్రమే రాణించారు. పేసర్ ఇందు బర్మకు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో నేపాల్ 16.1 ఓవర్లలో 4 వికెట్లకు 118 పరుగులు చేసి నెగ్గింది. కవిషకు మూడు వికెట్లు దక్కాయి.
Updated Date - Jul 20 , 2024 | 05:22 AM