‘ఏటీపీ’ చాంప్ సినర్
ABN, Publish Date - Nov 19 , 2024 | 06:34 AM
ప్రపంచ టెన్నిస్ పురుషుల నెంబర్‌వన్ జానిక్ సినర్ సొంతగడ్డపై అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ సీజన్ ముగింపు టోర్నమెంట్, ప్రతిష్టాత్మక ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో సింగిల్స్
టూరిన్ (ఇటలీ): ప్రపంచ టెన్నిస్ పురుషుల నెంబర్‌వన్ జానిక్ సినర్ సొంతగడ్డపై అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ సీజన్ ముగింపు టోర్నమెంట్, ప్రతిష్టాత్మక ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో సింగిల్స్ చాంపియన్‌గా నిలిచాడు. ఈ మెగా ట్రోఫీతో ఈ ఏడాదికి ఘనమైన ముగింపు పలికాడు. ఆదివారం రాత్రి జరిగిన సింగిల్స్ తుదిపోరులో టాప్ సీడ్‌సినర్ 6-4, 6-4 స్కోరుతో అమెరికా స్టార్, ఐదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్‌ను వరుస సెట్లలో ఓడించి ఈ మెగా ఈవెంట్‌లో తొలిసారి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో 1986లో ఇవాన్ లెండిల్ (చెక్ రిపబ్లిక్) తర్వాత ఒక సెట్ కూడా కోల్పోకుండా ఏటీపీ టైటిల్ గెలిచిన తొలి ఆటగాడిగా 23 ఏళ్ల సినర్ రికార్డులకెక్కాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లను కూడా సినర్ దక్కించుకొన్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. వరల్డ్ నెంబర్‌వన్ ర్యాంక్ కూడా నిలబెట్టుకొని ఈ సీజన్‌కు గ్రాండ్‌గా వీడ్కోలు తీసుకున్నాడు.
Updated Date - Nov 19 , 2024 | 06:34 AM