ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘డబ్ల్యూటీఏ’ క్వీన్‌.. గాఫ్‌

ABN, Publish Date - Nov 11 , 2024 | 02:24 AM

అమెరికా టెన్నిస్‌ యువ సంచలనం కొకొ గాఫ్‌ సీజన్‌కు గ్రాండ్‌గా వీడ్కోలు పలికింది. సీజన్‌ ముగింపు టోర్నీ అయిన ప్రతిష్టాత్మక డబ్ల్యూటీఏ ఫైనల్స్‌ ట్రోఫీని గాఫ్‌ అందుకుంది...

అమెరికా స్టార్‌కు రూ. 40 కోట్ల ప్రైజ్‌మనీ

రియాద్‌: అమెరికా టెన్నిస్‌ యువ సంచలనం కొకొ గాఫ్‌ సీజన్‌కు గ్రాండ్‌గా వీడ్కోలు పలికింది. సీజన్‌ ముగింపు టోర్నీ అయిన ప్రతిష్టాత్మక డబ్ల్యూటీఏ ఫైనల్స్‌ ట్రోఫీని గాఫ్‌ అందుకుంది. శనివారం రాత్రి జరిగిన ఫైనల్లో గాఫ్‌ 3-6, 6-4, 7-6(2)తో జెంగ్‌ కిన్వెన్‌ (చైనా)ను ఓడించింది. విజేత గాఫ్‌కు రికార్డుస్థాయిలో రూ. 40 కోట్లు, రన్నరప్‌ జెంగ్‌ రూ. 31 కోట్లు ప్రైజ్‌మనీ రూపంలో దక్కింది. 2014లో సెరెనా విలియమ్స్‌ తర్వాత డబ్ల్యూటీఏ ఫైనల్స్‌ గెలిచిన తొలి అమెరికా క్రీడాకారిణిగా గాఫ్‌ రికార్డుకెక్కింది. అంతేకాదు.. 2004లో షరపోవా తర్వాత ఈ ట్రోఫీ నెగ్గిన పిన్న వయసు ప్లేయర్‌గానూ 20 ఏళ్ల గాఫ్‌ ఘనత సాధించింది.

Updated Date - Nov 11 , 2024 | 02:24 AM