Harbhajan Singh: పదివేల పరుగులు నువ్వు చేయలేకపోతే సిగ్గుపడాలి.. కోహ్లీతో హర్భజన్ ఏమన్నాడంటే..
ABN, Publish Date - Sep 03 , 2024 | 06:07 PM
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లోని అత్యుత్తమ బ్యాటర్లలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ఒకడు. వన్డేలు, టీ-20లు, టెస్ట్‌లు.. ఫార్మాట్ ఏదైనా పరుగులు చేసే యంత్రంగా కోహ్లీ ఎదిగాడు. అయితే ఎంత ట్యాలెంట్ ఉన్నప్పటికీ కోహ్లీ కెరీర్ ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లోని అత్యుత్తమ బ్యాటర్లలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఒకడు. వన్డేలు, టీ-20లు, టెస్ట్‌లు.. ఫార్మాట్ ఏదైనా పరుగులు చేసే యంత్రంగా కోహ్లీ ఎదిగాడు. అయితే ఎంత ట్యాలెంట్ ఉన్నప్పటికీ కోహ్లీ కెరీర్ ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సీనియర్లు, కెప్టెన్ ధోనీ సహకారంతో తన ఆటతీరును మార్చుకుని ప్రపంచ మేటి బ్యాటర్లలో ఒకడిగా ఎదిగాడు. మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. కాగా, కోహ్లీ కెరీర్ ఆరంభంలో ఇబ్బందులు పడుతున్నప్పుడు అతడితో జరిగిన సంభాషణను హర్భజన్ (Harbhajan Singh) తాజాగా గుర్తు చేసుకున్నాడు.
``కోహ్లీ తన టెస్ట్ మ్యాచ్‌ను వెస్టిండీస్‌పై ఆడాడు. విండీస్ పేసర్ ఫిడెల్ ఎడ్వర్డ్స్ షార్ట్ పిచ్ బంతులతో కోహ్లీని చాలా ఇబ్బంది పెట్టాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఎడ్వర్డ్స్ షార్ట్ బాల్స్‌కు కోహ్లీ ఔట్ అయ్యాడు. పెవిలియన్‌కు వచ్చి చాలా నిరాశకు గురయ్యాడు. తనపై తనే అనుమానం పెంచుకున్నాడు. ఆ సమయంలో నేను కోహ్లీతో మాట్లాడాను. ``నువ్వు టెస్ట్ క్రికెట్‌లో 10,000 పరుగులు చేయలేకపోతే సిగ్గుపడాలి. టెస్టు క్రికెట్‌లో 10,000 పరుగులు చేసే సత్తా నీకు ఉంది. అది చేయలేకపోతే అది పూర్తిగా నీ తప్పే అవుతుంది`` అని చెప్పాను`` అంటూ భజ్జీ అప్పటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు.
టీమిండియాకు ప్రపంచకప్‌లు అందించిన కెప్టెన్లు ధోనీ, రోహిత్ గురించి కూడా భజ్జీ స్పందించాడు. ఆ ఇద్దరి కెప్టెన్సీలలో తేడాను వివరించాడు. ధోనీ నాయకత్వంలో టీమిండియాకు ఆడిన భజ్జీ.. రోహిత్ కెప్టెన్సీలో ఐపీఎల్‌లో ఆడాడు. ``ఇద్దరూ గొప్ప నాయకత్వ పటిమ కలిగిన వారే. ధోనీ ఎప్పుడూ మైదానంలో ఆటగాళ్ల దగ్గరకు వెళ్లి ఎలా ఆడాలో సలహా ఇవ్వడు. ఎవరి తప్పుల నుంచి వారే స్వయంగా నేర్చుకోవాలనుకుంటాడు. రోహిత్ అలా కాదు. స్వయంగా ఆటగాడి దగ్గరకు వెళ్లి అతడి భుజం చేయి వేసి మాట్లాడతాడు. నువ్వు చెయ్యగలవు అంటూ ప్రోత్సహిస్తాడు`` అని భజ్జీ చెప్పాడు.
ఇవి కూడా చదవండి..
రైలు ప్రమాదంలో కాలు కోల్పోయినా..
త్వరలో రిటైర్మెంట్‌పై నిర్ణయం : సైనా నెహ్వాల్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Sep 03 , 2024 | 06:07 PM