India vs Zimbabwe : ఇద్దరే బాదేశారు
ABN, Publish Date - Jul 14 , 2024 | 06:40 AM
సిరీస్ నిర్ణాయక మ్యాచ్‌లో యువ భారత్ మరింత దూకుడును ప్రదర్శించింది. ప్రత్యర్థి బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యాన్ని చూపిన ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (53 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 93 నాటౌట్), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58 నాటౌట్) అజేయ
నేడు చివరి టీ20
సా. 4.30 నుంచి
సోనీ నెట్‌వర్క్‌లో
జైస్వాల్, గిల్ అజేయ అర్ధసెంచరీలు
3-1తో భారత్‌దే సిరీస్
నాలుగో టీ20లోనూ జింబాబ్వే ఓటమి
హరారే: సిరీస్ నిర్ణాయక మ్యాచ్‌లో యువ భారత్ మరింత దూకుడును ప్రదర్శించింది. ప్రత్యర్థి బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యాన్ని చూపిన ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (53 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 93 నాటౌట్), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58 నాటౌట్) అజేయ అర్ధసెంచరీలతో చెలరేగారు. దీంతో శనివారం జరిగిన నాలుగో టీ20లో భారత్ పది వికెట్లతో గెలిచింది. 3-1తో సిరీస్‌ను ఖాతాలో వేసుకుంది. ఆఖరి మ్యాచ్ ఆదివారమే జరుగనుంది. ముందు గా జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. సికిందర్ రజా (46) టాప్ స్కోరర్. ఆరంభంలో ఓపెనర్లు మరుమని (32), మధెవెరె (25) నిలకడను ప్రదర్శించారు. మిడిలార్డర్‌లో రజా ధాటిగా ఆడాడు. కానీ మరో ఎండ్‌లో వికెట్ల పతనం కొనసాగింది. అలాగే 19వ ఓవర్‌లో రజాను అరంగేట్ర పేసర్ తుషార్ దేశ్‌పాండే అవుట్ చేయడంతో జింబాబ్వే ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. చివరి ఓవర్‌లో పేసర్ ఖలీల్ 2 వికెట్లు తీసి 5 పరుగులే ఇచ్చాడు. ఛేదనలో భారత్ 15.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 156 రన్స్ చేసి గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా జైస్వాల్ నిలిచాడు.
మెరుపు ఆరంభం: ఛేదనలో ఓపెనర్లు జైస్వాల్, గిల్ ఎదురుదాడిని జింబాబ్వే బౌలర్లు ఏమాత్రం అడ్డుకోలేకపోయారు. ఈ జోడీ తొలి వికెట్‌కు అజేయంగా 156 రన్స్ అందించడంతో 28 బంతులుండగానే మ్యాచ్ ముగిసింది. తొలి ఓవర్‌లోనే జైస్వాల్ హ్యాట్రిక్ ఫోర్లతో వేట ఆరంభించాడు. అదే దూకుడుతో మూడో ఓవర్‌లోనూ 4 ఫోర్లు బాదడంతో పవర్‌ప్లేలోనే జట్టు 61 రన్స్ సాధించింది. 29 బంతుల్లోనే జైస్వాల్ ఫిఫ్టీ కూడా పూర్తయ్యింది. అప్పటికి గిల్ స్కోరు 13 రన్సే. ఇక గిల్ కూడా పదో ఓవర్‌లో మూడు ఫోర్లతో ఆకట్టుకోగా స్కోరు వంద దాటింది. 15వ ఓవర్‌లో చెరో సిక్సర్‌తో 16 రన్స్ రావడంతో జట్టు విజయానికి చేరువైంది. అటు గిల్ అర్ధసెంచరీ కూడా పూర్తయ్యింది. అయితే ఫోర్‌తో మ్యాచ్‌ను ముగించిన జైస్వాల్ సెంచరీకి 7 పరుగుల దూరంలో ఆగిపోయాడు.
స్కోరుబోర్డు
జింబాబ్వే: మధెవెరె (సి) రింకూ (బి) దూబే 25; మరుమని (సి) రింకూ (బి) అభిషేక్ 32; బెన్నెట్ (సి) జైస్వాల్ (బి) సుందర్ 9; రజా (సి) గిల్ (బి) తుషార్ 46; క్యాంప్‌బెల్ (రనౌట్) 3; మైర్స్ (సి అండ్ బి) ఖలీల్ 12; మదండె (సి) రింకూ (బి) ఖలీల్ 7; ఫరాజ్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 20 ఓవర్లలో 152/7. వికెట్ల పతనం: 1-63, 2-67, 3-92, 4-96, 5-141, 6-147, 7-152. బౌలింగ్: ఖలీల్ 4-0-32-2; తుషార్ 3-0-30-1; రవి బిష్ణోయ్ 4-0-22-0; సుందర్ 4-0-32-1; అభిషేక్ 3-0-20-1; శివమ్ దూబే 2-0-11-1.
భారత్: జైస్వాల్ (నాటౌట్) 93; గిల్ (నాటౌట్) 58; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 15.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 156. బౌలింగ్: ఎన్‌గరవ 3-0-27-0; ముజరబాని 3.2-0-25-0; చటార 2-0-23-0; ఫరాజ్ 4-0-41-0; రజా 2-0-24-0; బెన్నెట్ 1-0-16-0.
టీ20ల్లో వికెట్ నష్టపోకుండా 150+ స్కోరును ఛేదించడం భారత్‌కిదే తొలిసారి. అలాగే ఎక్కువ బంతులు (28) మిగిలి ఉండగానే మొదటిసారి మ్యాచ్‌ను పూర్తి చేసింది.
ఛేదనలో ఏ వికెట్‌కైనా రెండో అత్యధిక భాగస్వామ్యం అందించిన జైస్వాల్-గిల్.
భారత్ నుంచి టీ20ల్లో తొలి వికెట్‌కు 150+ భాగస్వామ్యం నమోదవడం ఇది ఐదోసారి.
Updated Date - Jul 14 , 2024 | 06:40 AM