ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

T20: పొట్టి క్రికెట్‌లో జింబాబ్వే రికార్డ్

ABN, Publish Date - Oct 23 , 2024 | 07:37 PM

టీ 20ల్లో జింబాబ్వే రికార్డ్ క్రియేట్ చేసింది. అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డ్ సృష్టించింది. గాంబియా జట్టుపై 120 బంతుల్లో 344 పరుగులు కొట్టింది. ప్రత్యర్థి బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించారు.

Zimbabwe Create World Record

టీ 20 క్రికెట్ చరిత్రలో జింబాబ్వే పెను సంచలనం సృష్టించింది. 20 ఓవర్లలో హైయస్ట్ రన్స్ కొట్టి రికార్డ్ పుటల్లోకి ఎక్కింది. 120 బంతుల్లో 344 పరుగులు బాది అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నిలిచింది. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ప్రత్యర్థి జట్టు గాంబియా బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 43 బంతుల్లో మెరుపు సెంచరీ పూర్తి చేశాడు. ఏడు ఫోర్లు, 15 సిక్సులతో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. 133 పరుగులు చేసి, జింబాబ్వేకు భారీ స్కోరు అందించాడు. టీ 20 వరల్డ్ కప్ సబ్ రీజనల్ ఆఫ్రికా క్వాలిఫైయర్ టోర్నీలో జింబాబ్వే రికార్డ్ క్రియేట్ చేసింది.


విరుచుకుపడ్డ జింబాబ్వే..

గాంబియా జట్టుపై జింబాబ్వే జట్టు విరుచుకుపడింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 344 పరుగులు చేసింది. జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. జింబాబ్వే తరఫున టీ 20లో సెంచరీ చేసిన ఫస్ట్ ప్లేయర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. సికిందర రజాతోపాటు తడివానాశే మారుమణి రెచ్చిపోయాడు. 19 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సులు బాది 62 పరుగులు చేశాడు. బ్రియాన్ బెన్నెట్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. క్లైవ్ మండాడే 17 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులతో 53 రన్స్ చేశారు. అందరూ సమిష్టిగా రాణించడంతో జింబాబ్వే జట్టు టీ 20లలో అత్యధిక పరుగులు చేసి రికార్డ్ సృష్టించింది.


నేపాల్ రికార్డ్.. తర్వాత

టీ 20లలో ఇప్పటివరకు నేపాల్ పేరు మీద అత్యధిక పరుగుల రికార్డు ఉంది. 2023 సెప్టెంబర్‌లో మంగొలియా జట్టుపై నేపాల్314 రన్స్ చేసి రికార్డు సృష్టించింది. ఈ నెలలో బంగ్లాదేశ్ మీద ఇండియా 297 పరుగులు చేసింది. సీషెల్స్‌పై జింబాబ్వే 286 రన్స్ చేసింది. 2019 ఫిబ్రవరిలో ఐర్లాండ్ జట్టుపై ఆఫ్ఘానిస్థాన్ 278 రన్స్ చేసింది. పొట్టి క్రికెట్‌‌లో బ్యాట్స్ మెన్ హవా కొనసాగుతోంది. బాల్ కనిపిస్తే చాలు చితక్కొడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం

Updated Date - Oct 23 , 2024 | 08:38 PM